JDU Leader Abhay Kushwaha Shakes A Leg With Scantily Clad Women

Jdu mla found pole dancing with bar dancer

jdu leader,abhay kushwaha,abhay kushwaha dirty dancing,abhay kushwaha with bar dancers,jdu leader with bar dancers,jdu leader dancing pics,jdu leader dancing images,jdu leader shakes a leg,jdu leader dances with bar girls,bihar polls,dancers,jdu,india,politics

A Janata Dal United (JDU) leader and its candidate for upcoming Bihar elections Abhay Kushwaha’s pictures allegedly showing him shaking a leg with and showering money on bar dancers have gone viral on social media.

ITEMVIDEOS: ఓట్ల కోసం పాట్లే కాదు.. స్టెపులు వేస్తున్న అభ్యర్థులు

Posted: 09/30/2015 09:32 AM IST
Jdu mla found pole dancing with bar dancer

బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఐదు విడతలుగా జరగనున్న ఎన్నికలలో అన్ని పార్టీలో పోటీ పడీ మరీ నేరపూరిత చరిత్ర కలిగిన అభ్యర్థులకే టిక్కట్లను కట్టబెట్టాయని ఇప్పటికే అరోఫణలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. అబ్యర్థుల గుణగణాలు కూడా ఇక్కడ ప్రధాన పాత్రను పోషించనున్నాయి. రౌడీ షీట్లర్లకు, గుండాలకు టిక్కెట్ల పంఫిణీతో ఎన్నికలలో ఎలాంటి బయోత్సాత, బీతాహహ ఘటనలు జరుగుతాయోనని ఇప్పటికే బీహార్ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీహార్ లో తమ పార్టీ నేరచరిత కలిగిన వారికి, సంపన్నులకు టిక్కెట్లను అమ్ముకుంటుందని సోంత పార్టీకి చెందిన ఎంపీ అర్కే సింగ్ బాహాటంగానే అరోపణలు గుప్పించారు.

సరిగ్గా ఇలాంటి తరుణంలో ఓట్ల కోసం అక్కడి పార్టీ అభ్యర్థులు తమదైన శైలిలో పాట్లు పడుతున్నారు. యువతను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్న అభ్యర్థులు రికార్డింగ్ డాన్సులు వేయించి మరీ యువతను హుషారెక్కిస్తున్నారు. అంతేకాదు, యువతకు జోష్ పెంచే క్రమంలో భాగంగా తాము యువతేనంటూ రికార్డింగ్ డాన్స్ వేసే మహిళలతో పాటుగా జతకలసి స్టెపులేస్తున్నారు. ఇలాంటి తతంగానికి పాల్పడిన ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి అడ్డంగా మీడియాకు దోరికిపోయారు.

బీహార్ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభయ్ కుష్వాహా ఓ లేడీ డాన్సర్‌తో కలిసి చిందేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఇలా రికార్డింగ్ డ్యాన్సు చేయడం ఇప్పుడు బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విధమైన ఎన్నికల ప్రచారాన్ని తాము ఎక్కడా చూడలేదని పలువురు బీహార్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. పొట్టి డ్రస్సు వేసుకున్న యువతితో సినిమాలో హీరోయిన్‌తో హీరో చేసే రొమాంటిక్ సాంగ్‌లా అభయ్ కుష్వాహా చేసిన డాన్స్‌కు సంబంధించిన వీడియో యూటూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janata Dal (United)  abhay kushwaha  shakes leg with bar dancer  Bihar Politics  

Other Articles