Lokesh sudden elevation as TD general secretary, coincidence or scheme?

Nara lokesh is tdp general secretary and ex officio member

Lokesh as TDP general secretary, Nara Lokesh TDP general secretary, Chandrababu Naidu lokesh TDP, Lokesh, TDP general secretary, Nara Lokesh, TDP

Lokesh will be appointed as one of the three TD general secretaries and Naidu makes official announcement today.

టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నారా లోకేష్..

Posted: 09/30/2015 10:46 AM IST
Nara lokesh is tdp general secretary and ex officio member

ఆంధ్రుల అభిమాన నటుడు, ఆరాధ్యుడు, బిసి, ఎస్సీ, ఎస్టీ సహా అణగారిన వర్గాల ప్రజలకు ఓటు విలువను తెలిపిన నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ గత 33 ఏళ్లుగా ప్రాంతీయ పార్టీగా సేవలందించింది.. ఇవాళ్టి నుంచి జాతీయ పార్టీగా సేవలందించనుందని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఒక కేంద్రకమిటీ, రెండు రాష్ట్ర కమిటీలుగా ఉంటాయని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం జాతీయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కమిటీలను చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 17మంది సభ్యులతో కేంద్ర పొలిట్‌ బ్యూరో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

కేంద్ర పొలిట్‌ బ్యూరో సభ్యులుగా చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, నందమూరి హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి, రమేష్ రాథోడ్, ఉమామాధవ రెడ్డి, మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రతిభా భారతి, నామా నాగేశ్వరరావులను నియమించారు. ఇక పార్టీ పోలిట్ బ్యూరోలోకి ఎక్స్ అఫిషియోలుగా నారా లోకేష్‌తో పాటు సుజనా చౌదరి, కళా వెంకట్రావు, ఎల్ రమణలను నియమించారు.

తన కుమారుడు, టీడీపీ యువనేత నారా లోకేష్‌కు పార్టీ కేంద్ర కమిటీలో ఉపాధ్యక్షుడి పదవిని చంద్రబాబు అప్పగించారు. లోకేష్ రెండు రాష్ట్రాల్లో పర్యటనలు జరిపి కార్యకర్తలతో మమేకం కావాల్సి వున్నందున ఒక రాష్ట్రానికి పరిమితం చేయకుండా కేంద్ర కమిటీలో ఉంచామని తెలిపారు. కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులుగా పి.రాములు, గరికపాటి రామ్మోహన్‌రావు, డి.కె.సత్యప్రభ, నారా లోకేశ్‌, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కొనకళ్ల నారాయణ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్‌.రమణ, వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినట్లు తెలిపారు.

ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇకపై జాతీయ పార్టీకి అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1982లో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ రాష్ట్ర విభజనతో జాతీయ పార్టీగా మారాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ 69 మందితో ఏర్పాటు కాగా, తెలంగాణ రాష్ట్ర కమిటీ 90 మందితో ఏర్పాటైంది.

ఆంధ్రప్రదేశ్‌ కమిటీ అధ్యక్షుడు: కిమిడి కళా వెంకట్రావు.
ప్రధాన కార్యదర్శులు: నిమ్మల రామానాయుడు, బివి జయనాగేశ్వర్‌రెడ్డి, వర్ల రామయ్య, రెడ్డి సుబ్రమణ్యం.
కోశాధికారి: బిసి జనార్ధనరెడ్డి.
జాతీయ ప్రధాన కార్యదర్శులు: నారా లోకేశ్‌, కొనకళ్ళ నారాయణరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి.
ఉపాధ్యక్షులు: మాగుంట శ్రీనివాసుల రెడ్డి, రాములు, సత్యప్రభ.
జాతీయ అధికార ప్రతినిధులు: పయ్యావుల కేశవ్‌, బొండా ఉమామహేశ్వరరావు, ఇ.పెద్దిరెడ్డి, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌, కింజరాపు రామ్మోహన నాయుడు.
జాతీయ కోశాధికారి: సిద్ధా రాఘవరావు.
కేంద్ర పొలిట్‌ బ్యూరో సభ్యులు: చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, నందమూరి హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి, రమేష్ రాథోడ్, ఉమామాధవ రెడ్డి, మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రతిభా భారతి, నామా నాగేశ్వరరావు
పోలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియోలు: నారా లోకేష్‌తో పాటు సుజనా చౌదరి, కళా వెంకట్రావు, ఎల్ రమణ
కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులుగా పి.రాములు, గరికపాటి రామ్మోహన్‌రావు, డి.కె.సత్యప్రభ, నారా లోకేశ్‌, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కొనకళ్ల నారాయణ
కేంద్ర కమిటీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్‌: ఎంఎ షరీఫ్‌,
కేంద్ర కమిటీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్‌: వివిఎస్‌ చౌదరి
కేంద్ర కమిటీ మీడియా కమిటీ కన్వీనర్‌: ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్‌.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lokesh  TDP general secretary  Nara Lokesh  TDP  

Other Articles