indefinite shutdown of petrol pumps due to increase of vat

Ap petrol bunks bandh from october 1st

Petrol Bunks Bandh from October 1St, transportation bandh from october 1st, Gas Stations, petrol pump, VAT, Andhra Pradesh Federation of Petroleum Traders, petroleum tank truck op, removal of VAT on petrol and dissel, andhra pradesh, petrol bunks, ravi gopal krishna, ap government, cm, chandrababu naidu, cabinet sub committee, petrol price, Petrol Strike, indefinite strike

petrol bunks owners have decided to shut down bunks in AP demanding removal of VAT on petrol and dissel

ITEMVIDEOS: అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల బంద్

Posted: 09/30/2015 09:29 AM IST
Ap petrol bunks bandh from october 1st

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వాహనదారులకు మింగుడు పడని వార్తను అందించారు పెట్రోల్ బంకు యాజమానులు.  అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పెట్రోలు బంకులు నిరవధికంగా మూతపడనున్నాయి. అయితే వాహనదారులకు కొంత ఉపశమనం కలిగించే డిమాండ్ తో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లీటరుకు రూ.4 చొప్పున అదనంగా పెంచిన వ్యాట్‌ను రద్దు చేయాలని కోరుతూ పెట్రోల్ బంకుల నిరవధిక బంద్‌ను పాటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.గోపాలకృష్ణ  గుంటూరులో ప్రకటించారు.

ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు అక్టోబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక రవాణా బంద్ చేపడుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలోని సరుకు రవాణా వాహనాలు, పెట్రోలు, డీజిల్ రవాణా వాహనాలు, పెట్రోలు బంకుల కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేవలం రెండు రోజులు మాత్రమే వ్యవధి వుండటంతో వాహనదారులు కాస్తా ముందుచూపుతో వ్యవహరించి.. పెట్రోల్, డీజిల్ లను నిల్వలను తమ అవసరాలకు గాను నిల్వ చేసుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gas Stations  petrol pump  VAT  Andhra Pradesh Federation of Petroleum Traders  

Other Articles