Villagers attacked on police

Villagers attacked on police

Police, Villagers, Prakasham Dist, HIjra, Hijra Dance

Villagers attacked on police. In Prakasham dist of ap, pakalapallipalem villagers attacked on police and smashed a police vehicle.

డ్యాన్సుల వద్దన్నందుకు పోలీసుల మీద దాడి

Posted: 09/21/2015 10:48 AM IST
Villagers attacked on police

డ్యాన్స్ లు చేసే వాళ్లను ఆపమని చెప్పినందుకు ఖాకీల మీదనే దాడికి దిగిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటచేసుకుంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలపల్లపాలెంలో అర్దరాత్రి జరిగిన ఘటన ఇది. గ్రామంలో హిజ్రాలతో కలిసి అక్కడి స్థానికులు ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. డ్యాన్స్ లతో గానాభజానా పెట్టుకొని కాస్త ఎంజాయ్ చేద్దామనుకుంటే.. పోలీసులు వచ్చి అలా కుదరదు వెంటనే డ్యాన్స్ లు ఆపించాలని ఆదేశించారు. అయితే డ్యాన్స్ లు ఆపించేదానికి మాత్రం గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో తమ లాఠీలకు పని చెప్పారు. గ్రామస్తుల మీదకు పోలీసులు లాఠీలతో దాడికి దిగడంతో ఒక్కసారిగా గ్రామస్తుల పోలీసుల మీదకు ప్రతిదాడికి దిగారు.

Also Read: అహంభావి ‘ఖాకీ’కి తగిన శాస్తి.. పెద్దయానకు ప్రభుత్వం బాసట..!

పాకాలపల్లపాలెంలో గ్రామస్తుల మీదకు లాఠీలెత్తిన పోలీసులను పరిగెత్తించి.. పరిగెత్తించి కొట్టారు. పోలీస్ వాహనం మీద దాడిచెయ్యడంతో పాటుగా ఓ హోంగార్డ్ మీద కూడా తమ ప్రతాపాన్ని చూపించారు. దాంతో పోలీసులు పరుగులు తీశారు. అయితే విషయం తెలుసుకొని అక్కడకు మరికొంత మంది పోలీసులు చేరుకోగా.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసుల మీద దాడికి దిగిన వ్యక్తులను తమకు అప్పగించాలని పోలీసులు గ్రామపెద్దలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాత్రి పూట ఎవరు దాడి చేశారో తెలియదని.. కావాలంటే అందరిని అరెస్టు చెయ్యాలని గ్రామస్తులు అంటున్నారు.  ఏం చెయ్యాలో అర్థం కాని పోలీసులు ప్రస్తుతానికి పికెటింగ్ నిర్వహిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Villagers  Prakasham Dist  HIjra  Hijra Dance  

Other Articles