మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ఇండస్ట్రీలోనే కాకుండా వ్యాపారరంగంలోనూ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నాడు. చెర్రీ ఇప్పటికే ‘ట్రూజెట్’ విమానయాన రంగంలో భాగస్వామికగానే వుంటూనే.. దానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే! ఈ విమాన సేవల్ని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్న చెర్రీ.. ప్లాన్ ప్రకారమే విమానాలను రంగంలోకి దింపుతూ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. ఈ విమాన సేవలు నెమ్మదిగానే అయినా.. పక్కా ప్రణాళికతో విస్తరిస్తున్నాయి.
ఇప్పటికే ఈ విమాన సేవలు గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ ఎయిర్ వేస్ సేవలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు ఆనాడు ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా తాజాగా ట్రూజెట్ విమాన సేవలు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ప్రారంభమయ్యాయి. శంషాబాదు నుంచి గన్నవరం చేరుకున్న ట్రూజెట్ విమానం, తిరిగి హైదరాబాదుకు విజయవంతంగా తిరుగు ప్రయాణమైందని ఆ సంస్థ ఎండీ వంకాయలపాటి ఉమేశ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. విజయవంతంగా ప్రారంభమైన తమ విమాన సేవల్ని.. రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాలకు త్వరలోనే తమ విస్తరిస్తామని ఉమేశ్ పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. ట్రూజెట్ విమాన సేవలు విజయవంతంగా ప్రారంభమైన నేపథ్యంలో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆ సంస్థ ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో కూడా చెర్రీ ఈ విధంగా స్పందించాడు. తమ సేవలు సక్సెస్ ఫుల్ గా రన్ అయితే.. దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఓ ఇంటర్వ్యూ నేపథ్యంలో పేర్కొన్నాడు. ఏదేమైనా.. చెర్రీ తన టాలెంట్ ఇండస్ట్రీలోనే కాకుండా వ్యాపార రంగంలోనూ బాగానే నిరూపించుకుంటున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more