CM Akhilesh Yadav does repair work post UP Police' SI blotted humanity in Lucknow

Cop suspended after he smashes typewriter of an elderly man in up

Up police , Krishan kumar , Akhilesh yadav , Sub inspector pradeep kumar , Gpo lucknow , Dm , Ssp , Typewriter , Social media , Pradeep kumar suspended

Uttar Pradesh Police’ Sub-Inspector, who abused and broke the typewriter of an elderly man at GPO here on Saturday, has been suspended after the swift intervention of Chief Minister Akhilesh Yadav

అహంభావి ‘ఖాకీ’కి తగిన శాస్తి.. పెద్దయానకు ప్రభుత్వం బాసట..!

Posted: 09/20/2015 08:56 PM IST
Cop suspended after he smashes typewriter of an elderly man in up

ఉత్తరప్రదేశ్‌లో నిత్యం జరుగుతున్న నేరాలు, ఘోరాలపై విరుచుకుపడి వాటిని నియంత్రించాల్సిన పోలీసులు.. అందుకు భిన్నంగా వ్యవహరించి నెట్ జనుల ఆగ్రహానికి గురయ్యారు. తమలో కాఠిన్యం తప్ప కరుణ్యం ఏ మాత్రం లేదని ఓ ఎస్ ఐ.. మరోసారి తమ రాక్షసత్వాన్ని నిరూపించుకున్నారు. లక్నో హజ్రత్‌గంజ్ పోస్టాఫీసు వెలుపల ఓ 65 వృద్దుడు  కిషన్ కుమార్ తన జీవనాధారాన్ని సాగిస్తున్నాడు. అయితే రోజుకు పది గంటల పాటు పనిచేసి.. ఆ వచ్చిన పదో పాతికతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

అది పూర్తిగా నేరమైనట్లు.. రాజ్యాంగ విరుద్దమైనట్లు, రాజద్రోహంగా పరిగణించిన ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ తన ప్రతాపం చూపించాడు. ఖాళీ చేయమన్నా.. ఎందుకు చేయడం లేదని ముసలాయనపై చిందులేశాడు. 30 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో కూర్చోని తన పని తాను చేసుకుంటున్నానని, ఇప్పుడు అకస్మాత్తుగా ఇక్కడి నుంచి వెళ్లగోడితే ఎక్కడికి వెళ్లాలని ఆయన ఎస్ఐను వేడుకున్నాడు. ఇన్ని ఏళ్లుగా ఇక్కడే వున్నా.. రోజుకు పది గంటలు పనిచేస్తూన్నా.. 50 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి కూడా లేదన్నారు. అలాంటి మరో చోటికి వెళ్తే.. తన పరిస్థితి దయనీయంగా మారుతుందని ప్రాధేయపడ్డాడు.

తన తండ్రి వయస్కుడైన వృద్దుడు రెండు చేతులు జోడించి.. తనను ఇక్కడి నుంచి గెంటి వేయవద్దని బతిమాలినా.. ఆ కఠినాత్ముడు కనుకరించలేదు. చివరకు వృద్దుడికి జీవనాధారమైన టైప్ రైటర్‌ను కాలితో తన్ని పగలకొట్టాడు. రెండు చేతులతో ఎత్తి పడేశాడు. తనపై ఎస్‌ఐ దౌర్జన్యం చేయడంపై వృద్ధుడు లబోదిబోమన్నాడు. ఎస్‌ఐ దుర్మార్గాన్ని ఫొటోలు తీసిన స్థానికులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఎస్ఐ దౌర్జన్యంపై నెటిజన్లు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న సిఎం అఖిలేష్ యాదవ్ దౌర్జన్యానికి పాల్పడ్డ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్, డిఎస్పీ ఇద్దరూ ముసలాయన కిషన్ కుమార్‌ను కలిసి సారీ చెప్పారు. కొత్త టైప్‌రైటర్ కొనిచ్చారు. తన జీవనోపాధిని యధాస్థానంలో కొనసాగించాలని విన్నవించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Up police  Krishan kumar  Akhilesh yadav  Sub inspector pradeep kumar  

Other Articles