Narendra Modi's 'Make in India' is 'Take in India', says Rahul Gandhi

Modi s make in india is take in india rahul gandhi

kisan mazdoor samman rally, sonia gandhi, rahul gandhi, sonia gandhi kisan rally, land bill, sonia land bill, congress, land bill, narendra modi, sonai gandhi farmers, land bill, congress, bihar polls, ramlila maidan, farmer protest, politics news, nation news

Once again hitting out at the Modi government, Rahul Gandhi said the Prime Minister is ready to meet experts and industrialists but engages with farmers only through his radio programme Mann Ki Baat.

మోడీది మేక్ కాదు.. టేక్ ఇన్ ఇండియా అంటూ రాహుల్ విసుర్లు

Posted: 09/20/2015 09:33 PM IST
Modi s make in india is take in india rahul gandhi

భారత దేశాన్ని తన హస్తాలలోకి తీసుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తీవ్రంగా శ్రమపడుతున్నారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రధాని ద్వందనీతి కలిగిన వ్యక్తని, ఆయన చెప్పేదోకటి చేసేది మరోకటని రాహుల్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఇందుక ప్రధాని తన మాసనపుత్రికగా పేర్కొంటున్న మేక్ ఇన్ ఇండియాను ప్రజలకు చూపుతూ.. తెర వెనుక మాత్రం టేక్ ఇన్ ఇండియాగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల విషయంలో మోదీ సర్కార్‌ అదే తీరున వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. భూసేకరణ ఆర్డినెన్స్‌పై మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం ప్రజా విజయంగా అయన అభివర్ణించారు. భూ సేకరణ చట్టంలో సవరణలకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకించిందని, ప్రజాక్షేత్రంలోనూ రైతులను కలుపుకుని వెళ్లిన తమ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించిందని ఆయన చెప్పారు. ఈ తరుణంలో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. రాష్ట్ర స్థాయిలో రైతుల నుంచి భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు.

ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ కిసాన్‌ ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఆంగ్లంలో మేక్‌ అంటే తయారు చేయడం అని, టేక్‌ అంటే లాక్కోవడం లని... ఇది మేక్‌ ఇన్‌ ఇండియా కాదు.. మోదీ టేక్‌ ఇన్‌ ఇండియా అని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాట విజయం కేవలం లోక్‌సభ, రాజ్యసభల్లో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీల శక్తి వల్ల కలిగినది కాదని, వారి గుండెల్లో భారత రైతుల శక్తి నిండిందని, అందుకే వారు విజయం సాధించారని ఆయన అన్నారు. ఈ పోరాటం ఇక్కడితో అయిపోలేదని రాహుల్‌ అన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్‌ పోరాటం చేయాల్సి ఉందని ఆయన పిలుపు ఇచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhil  PM narendra modi  land bill  congress  bihar polls  

Other Articles