Smriti Irani says not afraid of Congress' notice, challenges Rahul Gandhi to put her behind bars

Smriti irani dares rahul gandhi to send her behind bars

Smriti Irani dares Rahul Gandhi to send her behind bars, smriti irani, rahul gandhi, land grab, smriti irani land grab, smriti irani legal notice, rahul gandhi trust, lok sabha elections, smriti irani jail, land grab allegations, politics news, nation news, india news

Union Human Resource and Development Minister (HRD) Smriti Irani on Sunday hit back at the Congress Party over the legal notice issued to her, saying she is not afraid and is ready to face 100 such notices for raising the voice of the people.

దమ్ముంటే నన్ను జైల్లో పెట్టించండీ.. కాంగ్రెస్ కు కేంద్రమంత్రి సవాల్

Posted: 09/20/2015 08:23 PM IST
Smriti irani dares rahul gandhi to send her behind bars

దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ కానీ.. తనను జైలులో పెట్టాలని కేంద్ర మానవ వనరులశాఖా మంత్రి స్మృతీ ఇరానీ సవాల్ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై భూ కుంభకోణానికి సంబంధించిన అరోపణలు గుప్పించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది. దీనిపై ఆమె అమేథీ బహిరంగసభలో స్పందించారు. రైతులు, ప్రజల తరపున మాట్లాడినందుకు తనకు లీగల్ నోటీసులు పంపారని చెప్పారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయించాలని ఆమె రాహుల్‌కు సవాలు విసిరారు.

ఫ్యాక్టరీ పెడతామని తీసుకున్న భూమిలో ఫ్యాక్టరీ అయినా కట్టండి లేదా భూమి అయినా తిరిగి ఇచ్చెయ్యాలని ఆమె మరోసారి కోరారు. లీగల్ నోటీసుల పేరుతో తన నోరు మూయించలేరని చెప్పారు. గతంలో సైకిల్ కర్మాగారం పెడతామంటూ ఓ కంపెనీకి ప్రభుత్వ భూమిని ఇచ్చారు. ఆ తర్వాత ఫ్యాక్టరీ యాజమాన్యం దివాళా ప్రకటించి భూమిని రాజీవ్ ట్రస్ట్‌కు అమ్మింది. దీన్ని మంత్రి స్మృతీ ఇరానీ సవాలు చేశారు. లోపాయకారీ ఒప్పందంతోటే ఇలా చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది.

అయితే కేంద్ర మంత్రి హోదాలో కొనసాగుతూ.. స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీపై సవాలు విసరడాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. కేంద్రంలో అధికారంలో వున్నామన్న ఒకే ఒక్క కారణంతో స్మృతి ఇరానీ ప్రత్యర్థి పార్టీలపైనా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపైన విమర్శలు సంధించి.. సవాలు చేయడం సరికాదని అంటున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చేతిలో ఓటమిని చవిచూసిన తరువాత కూడా ఆయన పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్లి సవాళ్లు విసరసడం ఎంతవరకు సమంజసమని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smriti irani  rahul gandhi  legal notices  arrest  

Other Articles