Police beaten students in Vishkapatnam.

Police beaten students in vishkapatnam

Police, SFI, Students, Vishakapatnam, Mess Charges

Police beaten students in Vishkapatnam. SFI student union leaders and some more students protest at Vishaka collectorate, Police beaten them.

ITEMVIDEOS: విద్యార్థులను చితకబాదిన పోలీసులు

Posted: 09/16/2015 08:37 AM IST
Police beaten students in vishkapatnam

లాఠీకి మన, పర బేధాలుండవు కేవలం డ్యూటీ మాత్రమే అని పోలీసు లాఠీ గురించి ఓ చిన్న నానుడి ఉంది. అయితే చాలా వరకు అది నిజమే అనిపిస్తుంది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నామనుకుంటున్నారా..? విశాఖపట్నంలో ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థుల మీద పోలీసులు లాఠీలు ఝులిపించారు. విద్యార్థులు అన్న విషయం కూడా పట్టించుకోకుండా అందులోనూ... లేడీస్, జెంట్స్ అనే తేడా లేకుండా అందరికి ఒకేరకమైన ట్రీట్ మెంట్ చేశారు. రోడ్ల మీద విద్యార్థులను దారుణంగా కొట్టిన సందర్భం అక్కడి పోలీసుల మీద విమర్శలకు దారి తీసింది. పోలీసుల తీరు మరీ అమానుశంగా ఉందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ధర్నా చేసుకుంటుంటే.. ఇంత దారుణంగా లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల ప్రతాపమిది. మెస్‌ చార్జీలు తగ్గించాలని, డిగ్రీలో సెమిస్టర్‌ విధానం రద్దు చేయాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, ప్రైవేటు యూనివర్సిటీల జీవో-30ని రద్దు చేయాలని సుమారు 300 మంది విద్యార్థులు కలెక్టరేట్‌ వద్ద నిరసనకు దిగారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిపై లాఠీలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దొరికిన వారిని దొరికినట్టే చావబాదారు. విద్యార్థులను రోడ్లపై ఈడ్చుకెళ్లారు. అమ్మాయిలను మహిళా హోంగార్డులు జత్తు పట్టుకొని లాక్కెళ్లారు. దీన్ని నిరసించిన అమ్మాయిల పట్ల మగ పోలీసులు ఇష్టానుసారం వ్యవహరించారు. భయంతో పరుగులు తీసినా సరే వదిలిపెట్టకుండా వెంటపడి మరీ కొట్టారు. విద్యార్థి నాయకుల్ని బలవంతంగా జీపుల్లోకి ఎక్కించారు. నిరాకరించిన వారిని లాఠీలతో కుళ్లబొడిచారు. వారు విద్యార్థులనే స్పృహ కోల్పోయి.. రౌడీలను బాదినట్టు బాదారు. పోలీసుల చర్యలకు అమ్మాయిల భయభ్రాంతులకు గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నా పోలీసుల పాషాణ హృదయాలు కరగలేదు. అందరినీ వాహనాల్లో ఎక్కించి నగరమంతా తిప్పి మరింత భయానికి గురిచేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  SFI  Students  Vishakapatnam  Mess Charges  

Other Articles