Nashik policeman Manoj Barhate who thwarted mans suicide bid

Meet nashik policeman manoj barhate who thwarted mans suicide bid

Police, Kubh Mela, nasik, Manoj, Police Manoj, varda Dist

Meet Nashik policeman Manoj Barhate who thwarted mans suicide bid A young policeman jumped off a 20 feet high bridge in Nashik to rescue a man, who was apparently trying to commit suicide. The policeman's bravery was captured on a CCTV camera installed near the spot as Nashik is holding Kumbh Mela. There was a significant presence of police at the spot in Talkuteshwar area in the wake of Kumbh Mela.

ITEMVIDEOS: పోలీస్ సాహసానికి సెల్యూట్

Posted: 09/16/2015 08:38 AM IST
Meet nashik policeman manoj barhate who thwarted mans suicide bid

కనిపించే మూడు సింహాలు.. నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే...కనిపించని నాలుగో సింహమే పోలీస్.. పోలీస్.. అంటూ డైలాగ్ లు వినే ఉంటాం. కానీ పోలీసులు ఎంత డ్యూటీ మైండెడో, ఎంత కరప్షన్ కు కేరాఫో అందరికి తెలుసు. అయితే పోలీసులు అందరూ అలానే ఉంటారు అని కాదు. ఎంతో మంది పోలీసులు తమ సేవలను సమాజానికి అందిస్తున్నారు. తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి మన రక్షణలో పాలుపంచుకుంటున్నారన్నది మాత్రం చాలా మందికి గుర్తుండదు. అయితే ఓ ట్రేయినీ కానిస్టేబుల్ చేసిన సాహసం.. అతడి డ్యుటీ అందరి చేత సెల్యూట్ కొట్టించుకుంటోంది. పోలీస్ అంటే వీడేరా అంటూ అందరిచేత మన్ననలు పొందుతున్నారు. ఇంతకీ అతడు ఏం సాహసం చేశాడో తెలుసా.?

కుంభమేళా పుష్కరాల్లో భాగంగా గోదావరి జన్మస్థానమైన నాసిక్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు హాజరైనారు. వార్దా జిల్లాకు చెందిన 24 ఏళ్ల ట్రైనీ కానిస్టేబుల్ మనోజ్ నాసిక్ లో పుష్కర పనుల్లో తాత్కాలిక విధులు నిర్వర్తించడానికి వచ్చాడు. అమర్ ధామ్ బ్రిడ్జ్ పై పెట్రోలింగ్ చేయడానికి సోమవారం సాయంత్రం అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ తో కలిసి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో బ్రిడ్జ్ పైనుంచి వ్యక్తి దూకడం చూశాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేయలేదు. అయితే మనోజ్ మాత్రం వెనకా ముందూ ఆలోచించకుండా వెంటనే 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జి పైనుంచి దూకాడు. నీటిలో మునిగుతున్న వ్యక్తిని కాపాడాడు.ఈ సంఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకి చిక్కింది. దీన్ని చూసిన కలెక్టర్, నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ గెడెం, ట్రైనీ కానిస్టేబుల్ దైర్యసాహసానికి ముగ్దుడై పొగడ్తలతో ముంచెత్తాడు. మనోజ్ బ్రిడ్జ్ పైనుంచి దూకుతున్న ఫోటోతో, వ్యక్తి ప్రాణాన్ని కాపాడినందుకు సెల్యుట్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మొత్తానికి ఇలాంటి పోలీసుల అవసరం సమాజానికి ఎంతైనా ఉంది. కానిస్టేబుల్ మనోజ్ కు మనసారా చేస్తున్నాం సెల్యూట్...

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Kubh Mela  nasik  Manoj  Police Manoj  varda Dist  

Other Articles