chandrababu about tourism in ap

Ap cm chandrababu naidu said that the state of ap will get best tourist place in india

AP, Chandrababu Naidu, Tourism, Coastal Area, Tourist places in AP, chandrababu about tourism

AP cm Chandrababu naidu said that the state of ap will get best tourist place in India. AP Has the all qualities for the best tourism he added.

త్వరలో పర్యాటకంలో ఫస్ట్ మనమే: చంద్రబాబు

Posted: 09/15/2015 08:56 AM IST
Ap cm chandrababu naidu said that the state of ap will get best tourist place in india

నవ్యాంధ్రప్రదేశ్‌ ఇక పర్యాటకశోభ సంతరించుకోనుంది.. రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు.. సుందర నగరాలలో పెట్టుబడులకు ఔత్సాహిక వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగ అభివృద్ధికి ఒక్కరోజులోనే 3వేల 845 కోట్ల మేర పెట్టుబడులకు సుముఖత వ్యక్తంచేస్తూ ప్రభుత్వంతో ఎంఒయులు కుదుర్చుకోవటం విశేషం. ఇది పర్యాటక అభివృద్ధిలాలేదని పారిశ్రామిక పెట్టుబడుల తరహాలో వ్యాపారులు ముందుకు రావటం శుభసూచకమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షామోదం తెలిపారు. పర్యాటకరంగ మిషన్‌తో పాటు నూతన పర్యాటక విధానాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలొ ఆవిష్కరించారు. ఏపిలో పర్యాటకరంగ అభివృద్ధికి ఆధ్యాత్మిక కేంద్రాలే కీలకంగా ఉన్నాయి.. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ఆదాయం పదివేల కోట్లకు దాటింది.. చెన్నైలో ఏర్పాటుచేసిన ఆలయానికి కూడా రూ. 25 కోట్ల మేర ఆదాయం వస్తోంది.. కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు 75వేల మంది భక్తులు తరలి వస్తున్నారని గుర్తుచేశారు.

నూతన విధానం ద్వారా పెద్దఎత్తున ఎంఒయులకు ముందుకు రావడం పారిశ్రామిక ప్రగతిని తలపిస్తోందన్నారు. ఐటి వినియోగంతో ఉపాధికల్పనా విభాగంగా పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 950 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం ఉంది.. ఈ ప్రాంతంలో 14 పోర్టులను అభివృద్ధి చేయనున్నాం..విశాఖతో పాటు కృష్ణాజిల్లా మంగినపూడి వద్ద కృష్ణానది, సముద్రంలో కలిసే సుందర మనోహర దృశ్యాలు.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, సోమశిల, కండలేరు, పట్టిసీమతో పాటు అనేక రిజర్వాయర్లు ఉన్నాయి.. ఈ ప్రాంతాల్లో జలపాతాలు.. ఇతర ప్రకృతి దృశ్యాలు.. వనరులను వినియోగించుకుని పర్యాటక కేంద్రాలుగా రూపు దిద్దుకుంటే ఉపాధి కల్పన రెట్టింపవుతుందని సీఎం ఆకాంక్షించారు. పర్యాటక అభివృద్ధికి నైపుణ్యతా కేంద్రాల ఆవశ్యకత ఉందన్నారు. కేరళ, గోవా, రాజస్థాన్‌ తరహాలో అభివృద్ధి సాధించగలిగితే 2022కు మిగిలిన రాష్ట్రాలకంటే ప్రధమ స్థానంలో ఏపి ఉంటుంది.. గోదావరి, కృష్ణానదీ తీరాల్లో పర్యాటక కేంద్రాలు నెలకొల్పాలి.. హోటళ్లు, రిసార్టులు, కనెక్టివిటీ పెరిగితే ఆదాయానికి ఢోకా ఉండదన్నారు. ఏపిలో అరకు, లంబసింగి, కాకినాడ, కోనసీమ, అంతర్వేది ప్రాంతాలు నదీ, సముద్రతీర ప్రాంతాలని, ఈ ప్రాంతాల్లో వసతుల కల్పన.. ఆకర్షణీయమైన ఉద్యానవనాలు.. పార్కులు.. ఏర్పాటు చేయటం ద్వారా సుందర నగరాలుగా తీర్చిదిద్దుకుంటాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu Naidu  Tourism  Coastal Area  Tourist places in AP  chandrababu about tourism  

Other Articles