Maharastra minister about the video clips in the night

Maharashtra minister bapats obscene video clip remark stirs row

Girish Bapat, Maharastra, video clip, obscene video clip remark, video clips at night

Maharashtra minister Bapats obscene video clip remark stirs row Maharashtra minister Girish Bapat triggered a controversy by making a remark about watching "video clips at night" during a students convention in Pune, which left the BJP red-faced and gave fodder to the party's detractors.

ITEMVIDEOS: ఆ మంత్రి రాత్రిపూట ఆ క్లిప్పులనే చూస్తాడట

Posted: 09/15/2015 09:01 AM IST
Maharashtra minister bapats obscene video clip remark stirs row

రాత్రి పూట మీరు ఎలాంటి వీడియోలు చూస్తారో మేము కూడా అలాంటి వీడియోలే చూస్తాం అంటూ ఓ మంత్రి గారు అన్న మాటలు స్టూడెంట్స్ ను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటీ అంటే జనరల్ గా విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెబుతారు కదా అని మంత్రిగారిని పిలిస్తే.. ఆయన గారు చెప్పిన మాటలకు అక్కడున్న వారికి మైండ్ బ్లాక్ అయింది. బుద్ది గడ్డి తిందా అని అక్కడున్న వారంతా అనుకుంటున్నా. మంత్రిగారు మాత్రం ఏ మాత్రం సిగ్గులేకుండా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని అనుకున్నారో ఏమో కానీ మంత్రి గారు ఇచ్చిన స్పీచ్ మాత్రం వివాదాస్పదమైంది.

తన స్థాయిని, హోదాను మరిచిన మహారాష్ట్ర ఆహార శాఖా మంత్రి గిరీష్ బపత్, విద్యార్థుల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అశ్లీలాన్ని ప్రోత్సహించేలా వున్నాయని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూణెలోని ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన, "రాత్రుళ్లు మీరు మొబైల్ ఫోన్లలో ఎలాంటి క్లిప్పింగ్స్ చూస్తారో మేం కూడా అవే చూస్తాం. మాకు వయసైపోయిందని ఎలా అనుకుంటారు? మా మనసుకు సంబంధించినంత వరకూ మేము ఇంకా యువకులమే" అని అన్నారు. గిరీష్ వ్యాఖ్యలపై ఓ న్యాయ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇలాంటి మంత్రులు ఉన్నంత వరకు విద్యా వ్యవస్థ... సమాజం ఎలా మారుతుంది చెప్పండి. ఇలాంటి వారికి అవకాశం కల్పిస్తున్న ఇండియాలో అందుకే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Girish Bapat  Maharastra  video clip  obscene video clip remark  video clips at night  

Other Articles