World Bank Released The Best State For Investments In India | Andhra Pradesh | Gujarat | Narendra Modi

World bank investments states list india andhra pradesh gujarat

world bank, telangana state, andhra pradesh state, gujarat state, pm narendra modi news, chandrababu naidu, andhra pradesh investsments

World Bank Investments States List India Andhra Pradesh Gujarat : World Bank Released The Best State For Investments In India In Which Andhra Pradesh Got Second Place And Telangana At 13

ఆ విషయంలో ‘తెలంగాణ’ కంటే ‘ఏపీ’నే బెస్ట్!

Posted: 09/14/2015 07:27 PM IST
World bank investments states list india andhra pradesh gujarat

విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే.. ఆర్థిక ఇబ్బందుల్లో పీకల్లోతు మునిగిపోయి ఏపీ.. ఈ విషయంలో మరింత వేగంగా పావులు కదుపుతోంది. ఏపీ ప్రభుత్వంతో సింగపూర్ తో సన్నిహిత సంబంధం ఎక్కువగా వున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే.. చైనా కూడా పలు సంస్థల్ని ఆ రాష్ట్రంలో నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మరోవైపు తెలంగాణ ఇప్పుడిప్పుడే పెట్టుబడులు రాబట్టే విషయమై ప్రయత్నాలు చేస్తోంది. ఏదేమైనా.. ఈ రెండు రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో ఏపీ ప్రభుత్వమే ముందుందని విశ్లేషకులు భావిస్తుండగా.. ఇది నిజమేనని ప్రపంచ బ్యాంకు ధృవీకరించింది.

భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల రాష్ట్రాల జాబితాను ప్రపంచబ్యాంకు తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాంకుల్లో అగ్రస్థానలో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నిలవగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. మూడో స్థానంలో జార్ఖండ్ రాష్ట్రం సంపాదించుకుంది. ఇక తెలంగాణ రాష్ట్రం మాత్రం 13వ స్థానంలో నిలిచింది. పెట్టుబడులను ఆహ్వానించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రయత్నిస్తుండగా.. ఆ రెండింటిలో ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు మరింత అనువుగా వుందని ఈ జాబితాను బట్టి అర్థమవుతోంది. ఈ జాబితా అంతర్జాతీయ వ్యాపార వేత్తలను ప్రభావితం చేసే అవకాశమూ లేకపోలేదు. ఈ ర్యాంకింగ్స్ ఆధారంగా ఏపీలో మరిన్ని కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు వీలుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ బ్యాంక్ ఆశలు రేపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world bank  investments states  andhra pradesh  telangana state  

Other Articles