Model And BiggBoss 5 Contestant Pooja Mishra Slaps Hotel Manager And Staff For Asking To Pay Bill | Pooja Mishra Controversy

Pooja mishra slaps hotel manager and staff for asking to pay bill

pooja mishra news, pooja mishra controversy, pooja mishra hotel controversy, pooja mishra hot photo shoot, indian models, sonakshi sinha, isha koppikar, bollywood celebrities, bigg boss celebrities

Pooja Mishra Slaps Hotel Manager And Staff For Asking To Pay Bill : Model And BiggBoss 5 Contestant Pooja Mishra Slaps Hotel Manager And Staff For Asking To Pay Bill.

ITEMVIDEOS: బిల్లు కట్టమంటే.. హోటల్ మేనేజర్ ని కొట్టింది!

Posted: 09/14/2015 06:26 PM IST
Pooja mishra slaps hotel manager and staff for asking to pay bill

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ మోడల్, బిగ్ బాస్ 5 కంటెస్టంట్ పూజా మిశ్రా మరో వివాదంతో తెరమీదకొచ్చింది. గతంలో ఏకంగా సోనాక్షి సిన్హా, ఇషా కొప్పికర్ లాంటి స్టార్లతోపాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల మీద కేసులు దాఖలు చేయించిన ఘనచరిత్ర కలిగిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఓ హోటల్ సిబ్బందిపై తన ప్రతాపం చూపించింది. మోడల్ కదా అని ఆ హోటల్ మేనేజ్ మెంట్ కాస్త మర్యాద ఇస్తే.. పొగరెక్కువై తనలో దాగిన రాక్షసత్వాన్ని ప్రదర్శించింది ఈ అర్ధనగ్న మోడల్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోడల్ పూజా మిశ్రా ద్వారకలోనే ఓ హోటల్ కు వెళ్లింది. అక్కడ తనకోసం ఓ ప్రత్యేక గది ముందుగానే బుక్ చేసుకున్న ఈ అమ్మడు.. లోనికి వెళ్లింది. అయితే.. ఆ గది నచ్చక లేక హోటల్ సిబ్బంది తనతో సరిగ్గా ప్రవర్తించలేదో తెలీదు కానీ.. ఈ అమ్మడు తానున్న గదిలో కొన్ని వస్తువులను పగలగొట్టింది. అనంతరం హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోతానంటూ తన లగేజీ బ్యాగ్ తీసుకుని బయటికి పరుగులు పెట్టింది. ఇంతలోనే హోటల్ సిబ్బంది ఆమెను అడ్డుకుని.. చేసిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లు కట్టాల్సిందేనని వారు నిలదీశారు. హోటల్ సిబ్బందిలో ఒకరు తన ఫోన్ లో ఈ మొత్తం వ్యవహారం వీడియో చిత్రీకరిస్తుండగా.. పూజా అతడి దగ్గరికి చేరుకుని, అతని చేతిలో వున్న ఫోన్ తీసుకుని పగలగొట్టేసింది.

వారిరువురి మధ్య వాగ్యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు నుంచి మరో వ్యక్తి ఆమె బ్యాగ్ ని లోనికి తీసుకెళ్లందేకు ప్రయత్నించాడు. అది గమనించిన ఆమె.. వెంటనే అతడ్ని వెంబడించి.. కాలుతో తన్నింది. నన్నే అడ్డుకుంటారా? అంటూ అగ్నిజ్వాలల ఆ సిబ్బందిపై ఎగిసిపడింది. ఈ మొత్తం తతంగాన్ని అక్కడే వున్న మరో వ్యక్తి వీడియో తీసి.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pooja mishra  sonakshi sinha  bigg boss contestants  

Other Articles