Pawan Kalyan | Chandrababu | Amaravati | capital | land poling

Ap govt implementing new plan to procure lands for ap capital

Pawan Kalyan, Chandrababu, Amaravati, capital, land poling, land acquisiation, Capital city

Ap govt implementing new plan to procure lands for ap capital. By the entry of Janasena party leader pawan Kalyan, The Govt change the plan.

పవన్ ఎంట్రీతో ప్లాన్ బి అమలు చేస్తున్న ప్రభుత్వం

Posted: 08/22/2015 08:25 AM IST
Ap govt implementing new plan to procure lands for ap capital

అటు రాజధాని నిర్మాణం, భూసేకరణ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు . భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసినా...వీలైనంత వరకు సమీకరణనకే రైతులను ఒప్పించాలని సూచించారు. అలాగే కేపిటల్ నిర్మాణంతో జరిగే మేలును మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు, అధికారులుకు సూచించారు .విజయవాడ క్యాంపు ఆఫీస్ లో పలు అంశాలపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. సీఆర్డీఏపై నిర్వహించిన సమావేశానికి మంత్రి నారాయణ, గుంటూరు జిల్లా కలెక్టర్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. భూసేకరణ ద్వారా సేకరించాల్సిన ౩వేల ఎకరాలు, నోటిఫికేషన్ వంటి అంశాలను గురించి అధికారులతో చర్చించారు సీఎం. నోటిపిషకేషన్ తర్వాత రైతులు, ప్రజలు, విపక్షాల నుంచి వస్తున్న వ్యతిరేకతను అడిగి తెలుసుకున్నారు. అలాగే అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూసేకరణతో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున వీలైనంత వరకు సమీకరణకే ఒప్పించేలా చూడాలని చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా ఎన్నికల సమయంలో తమకు అండగా ఉన్న పవన్ కళ్యాణ్ భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. రైతుల నుండి బలవంతంగా భూములు సేకరించడం మీద ఇప్పటికే తన నిరసన తెలిపారు. రైతుల నుండి భూములు లాక్కోవద్దు అని రిక్వెస్ట్ చేస్తూనే.. లాక్కుంటే ఊరుకునేది లేదు మరోసారి రైతులను తాను కలుస్తానని చెప్పడంతో ఏపి ప్రభుత్వం డైలమాలో పడింది. ఏం చెయ్యాలో ఏపి ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. తమ ప్రభుత్వానికి ప్రతిపక్షపార్టీల కన్నా పవన్ భయం ఎక్కువగా ఉంది అని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారట. ఏపీ రాజధానికి భూమల కోసం భూసేకరణ చట్ట ప్రయోగంపై పవన్‌ చేసిన వ్యాఖ్యల మీద టీడీపీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎలా రియాక్ట్ కావాలనే అంశంపై పార్టీ, ప్రభుత్వ పెద్దలు చర్చించారు. పవన్ దూకుడుగా ఉన్నా.... నేతలు సమన్వయం పాటించాలని అధిష్టానం సూచించింది. అమరావతికి భూసేకరణపై ఏపీ ప్రభుత్వం ముందుకే వెళుతోంది. నోటిఫికేషన్ ఇచ్చి భూ సేకరణకు నాంది పలికింది. ప్రభుత్వం ఎందుకు సేకరణకు వెళ్లాల్సి వస్తోందనే విషయం ప్రజలకు చెపితే చాలన్నారు. మంత్రులు సైతం పవన్ వ్యాఖ్యలపై ఆచి తూచి స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Chandrababu  Amaravati  capital  land poling  land acquisiation  Capital city  

Other Articles