YS Jagan | CBI | Friday | Assets Case

Ys jagan case will hear every friday in the cbi court

YS Jagan, Jagan, CBI, Friday, Assets Case, CBI court, YS Rajashekar Reddy

YS Jagan case will hear every friday in the CBI court.. The CBI court orders to examine the YS Jagan assets case on every friday.

జగన్ కు, శుక్రవారానికి మధ్యలో సిబిఐ

Posted: 08/22/2015 08:23 AM IST
Ys jagan case will hear every friday in the cbi court

జగన్ ఆస్తుల కేసులో మరో కీలక పరిణామం. ఇకపై ప్రతి శుక్రవారం విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. ట్రయల్ విచారణ వీలైనంత త్వరగా పూర్తయితే...ఈ కేసులో తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. జగన్ ఆస్తులకేసు దర్యాప్తు ప్రారంభమై ఇప్పటికే నాలుగేళ్లు పూర్తయిపోయింది. 2011 ఆగస్టు 17వతేదీన ఈకేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి విచారణ సాగుతూనే ఉంది. ఏ1 నిందితుడు జగన్మోహన్ రెడ్డి నుంచి పలువురు నిందితులు ఏడాదికిపైగానే జైలు జీవితం గడిపారు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటులు దాఖలవగా కొన్ని రోజుల క్రితం అభియోగ నమోదు ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ట్రయల్ విచారణ ఆలస్యమవుతుందని భావించిన సీబీఐ నాంపల్లి సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. డిశ్చార్జి పిటిషన్ లను త్వరగా తేల్చాలన్న హైకోర్టు ఆదేశాలను సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

సీబీఐ మెమోపై స్పందించిన కోర్టు విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇకపై ప్రతి శుక్రవారం జగన్ ఆస్తుల కేసును విచారించాలని నిర్ణయం తీసుకుంది. సీబీఐ కోర్టు నిర్ణయంతో జగన్ ఆస్తుల కేసు విచారణ వేగంవంతం కానుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులపై ఉన్న అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. వాటిపై అభ్యర్ధనల రూపంలో ఉన్న డిశ్చార్జిపిటిషన్ లపై వాదనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి శుక్రవారం విచారణ జరపాలని నిర్ణయంతో అవన్నీ త్వరలోనే పరిష్కారం కానున్నాయి. ట్రయల్ త్వరితగతిన పూర్తైతే తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Jagan  CBI  Friday  Assets Case  CBI court  YS Rajashekar Reddy  

Other Articles