Onion | Price | Inflation | Onion price rises

Onion price reach to hundred rupees in retail market

Onion, Price, Inflation, Onion price rises, Lasalgaon, pune, Maharashtra, Wholesale prices

Onion price reach to hundred rupees in retail market. By the market effect onion price increasing continuoysly.

ఉల్లి ధర 100 రూపాయలు.. ఆకాశంలోకి ఉల్లి ధరలు

Posted: 08/22/2015 08:50 AM IST
Onion price reach to hundred rupees in retail market

చందమామ రావే.. జాబిల్లి రావే.. కొండెక్కి రావే.. గోగుపూలు తేవే అని అమ్మ చిన్నప్పుడు మనకు గోరుముద్దలు తినిపించింది. ఇప్పుడు మాత్రం చందమామ రావే అని కాదు.. ఉల్లి తల్లి రావే.. కొండదిగి రావే.. ధర కాస్త తగ్గవే అంటూ జనాలు పాడుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకలా అనే ప్రశ్నకు సమాధానం ఎవరికీ అవసరం లేదు. నిత్యావసరాల్లో ఉల్లి ఎంతో ప్రధానమైంది. కాగా గత కొంత కాంలగా మార్కెట్ల ప్రభావంతో ఉల్లి ధర అంతకంతకు పెరుగుతోంది. హాప్ సెంచరీని ఎప్పుడో దాటిన ఉల్లి రికార్డ్ ధరలకు పరుగులు తీస్తోంది. హాఫ్ సెంచరీ నుండి సెంచరీ దిశగా పరుగు పెడుతుండటంతో సామాన్యుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ధర ఎన్నటికి తగ్గేనో అంటూ దిగారుగా కూర్చుంటున్నారు. బంగారం ధర తగ్గినా.. పెరిగినా ఉల్లి ధర మాత్రం తగ్గితే అంతకన్నా బంగారమా అంటూ చమత్కరించుకుంటున్నారు.

ఉల్లి దడ పుట్టిస్తోంది. ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. మార్కెట్‌లో మాత్రం ధరలు తగ్గడం లేదు. ఉల్లి ఎగుమతులను నిరుత్సాహపరిచేందుకు ఎగుమతి ధరను 250 డాలర్ల నుంచి 425 డాలర్లకు కేంద్రం పెంచింది. అలాగే ఉల్లి నిల్వలకు సంబంధించి గత ఏడాది విధించిన ఆంక్షలను మరో ఏడాది పొడిగించింది. అయినా ఫలితం లేదు. ప్రస్తుతం ఉల్లిపై పెట్టుబడి పెడితే 100 శాతం రిటర్న్స్‌ గ్యారంటీ అని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నాయి. ఉల్లికి కీలక మార్కెట్లైన పుణే, లసల్‌గావ్‌ ల్లో ఉల్లి హోల్‌ సేల్‌ ధర 100 శాతానికిపైగా పెరిగింది. దీనికి తోడు రిటైల్‌ మార్కెట్‌లో కూడా ధరలు అదుపు తప్పాయి. లసల్‌గావ్‌ లో సగటున కిలో ఉల్లి ధర జులైలో 15 రూ నుంచి 20 రూకి  ఆ తర్వాత వేగంగా పెరిగిపోయింది. ధరలు ఆగకుండా పెరిగిపోవటానికి పంట పండకపోవటమే అంటున్నారు. ఇంకోవైపు జాతీయ హార్టికల్చర్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ లెక్కల ప్రకారం మార్కెట్‌లోకి దిగుబడులు తక్కువ రావటమే కారణమని తేలింది.

ప్రస్తుత పరిస్థితి కరువుతో పాటు.. బ్లాక్‌మార్కెటింగ్‌ కారణమని ప్రభుత్వం భావిస్తోంది. బడాబడా వ్యాపారస్తులు, పెద్ద రైతులు ఉల్లిని బహిరంగ మార్కెట్‌లోకి విడుదల చేయకుండా.. నిల్వ చేస్తున్నారని అనుమానిస్తోంది. త్వరలో విజిలెన్స్ దాడులు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. అయితే, మహారాష్ట్రలో ఉల్లి మార్కెట్‌ను రాజకీయ నేతలే కంట్రోల్‌ చేస్తుండటంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో ఉల్లి రూ.55-60 పైమాటే. ఢిల్లీలో 80 నుంచి 100 రూపాయలు మధ్య ధర నడుస్తోంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో దిగుబడులు తగ్గాయంటున్నారు. దీంతో, ధరలు పెరిగాయని, మార్కెట్‌లోకి సరుకు వస్తే ధరలు వాటంతట అవే తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Onion  Price  Inflation  Onion price rises  Lasalgaon  pune  Maharashtra  Wholesale prices  

Other Articles