Two militants gunned down by security forces in Keran sector of Jammu and Kashmir's Kupwara district

Army foils two infiltration bids in jammu and kashmir

Army foils two infiltration bids in Jammu and Kashmir, army, jammu and kashmir, kupwara, Line of Control, soldier, terrorists, two infiltration bids, twin terror attack, India, Pakistan, armed forces, ceasefire violations

Army today foiled an infiltration bid along the Line of Control (LoC) in Keran sector of north Kashmir's Kupwara district. This is the second encounter between militants and army near the LoC in the district in the last 24 hours

జమ్మాకాశ్మీర్ లో ఏకకాలంలో రెండు చోట్ల ఉగ్రకాల్పులు.. జవాను, ఇద్దరు అగంతకులు మృతి

Posted: 08/09/2015 01:54 PM IST
Army foils two infiltration bids in jammu and kashmir

దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనం మట్టుబెట్టింది. జమ్ముకాశ్మీర్‌లోని కెరణ్ సెక్టార్‌లో సరిహద్దు ప్రాంతం నుంచి భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపింది.  అదే సమయంలో జమ్మూకాశ్మీర్ లోని కుప్పారా జిల్లాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు, భారత సైన్యానికి మద్య జరగిని మరో ఎన్ కౌంటర్ లో ఒక భారత జవాను వీర మరణం పోందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఇక్కడ గంట సేపటి నుంచి కాల్పులు కొనసాగుతూనే వున్నాయి.

ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి అదనపు సైన్యం బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఆగస్ట్ 15 యావత్ దేశ ప్రజానికం ఘనంగా జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించడమే లక్ష్యంతో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు సరిహద్దు దాటి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు భారత్ లో కాక భారీ దాడులు జరపాలని, విధ్వంస రచన లిఖించి, భీతావహ పరిస్థితులను సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదలు భారత్ లోకి నిత్యం ఏదో ఒక సరిహద్దు ప్రాంతం నుంచి చొరబేందుకు యత్నిస్తుంటారు.

వీరిని సరిహద్దు దాటించేందుకు పాక్ బలగాలు భారత జవాన్ల ఔట్‌పోస్ట్‌లపై దాడులు నిర్వహిస్తోంది. రాడార్లు, మోటార్లతో సైనికులపై దాడులకు పాల్పడుతూ.. ఇటు మరో సరిహద్దు నుంచి ఉగ్రవాదులను భారత్ లోకి చొరబడేందుకు సహకరిస్తుంది. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతూ ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకుంటోంది. పూర్తి అప్రమత్తంగా ఉంటోంది. గురుదాస్ పూర్ ఘటనతో పాటు ఉధంపూర్‌లో నావేద్ అలియాస్ ఉస్మాన్ సజీవంగా పట్టుబడిన నాటి నుంచీ పాక్ పెద్ద ఎత్తున కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Pakistan  armed forces  ceasefire violations  line of control (LoC)  

Other Articles