An 'English Coach' In Delhi Ran An Academy To Train The Next Generation Of ATM Thieves!

Master of heist this delhi school taught atm theft course

Delhi English Coach Academy Train Next Generation ATM Thieves, Delhi heist, ATM heist, Artful Dodger, Fagin, English Coach, Academy, Next Generation, ATM Thieves,ATM, Robbery, Spoken english, Rajiv Sahani atm, atm freeze, atm cracking, stealing money atm

Rajiv Sahani's coaching center for "command over English" was a brilliant cover for his real business - coaching the net generation of ATM hackers and crackers

చౌరకళా ప్రావిణ్యం కావాలా..? ఈ అకాడమీకి వెళ్తే సరి..!

Posted: 08/09/2015 01:08 PM IST
Master of heist this delhi school taught atm theft course

ఢిల్లీలో ఓ ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సు అకాడమీలో చోర కళను నేర్సిస్తున్నారు. ఔరా..! అనిపించేలా వున్న ఇది నిజం. దేశ రాజధాని డిల్లీలో రేపటి తరానికి ఇంగ్లీషుతో పాటు చోర కళలో కూడా సిద్దహస్తులను చేస్తున్నారు. అంతేకాదు ప్రాకికల్స్ నిర్వహించి మరీ ప్రావిణ్యాన్ని సంపాదించారా..? లేదా..? అని పరీక్షిస్తున్నారు. కేవలం రెండు వారాల్లోనే దొంగతనం చేయడంలో నిష్ణాతుల్ని చేస్తారు. ఇంతకీ ఈ అకాడమీ డైరెక్టర్ ఎవరా అంటరా..? యూపీలోని ఖరగ్‌పూర్‌కు చెందిన రాజీవ్ సహాని ఓ దొంగతనం కేసులో 2011లో జైలుకెళ్లాడు. అక్కడే తోటి ఖైదీ నుంచి ఏటీఎంను చోరీ చేయడం ఎలా అనే విషయంపై తర్ఫీదు పొందాడు. అక్కడ నుంచి బయటకొచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం ప్రారంభించాడు.

అయితే ఈ పని ఒక్కడే చేయడం కష్టమయ్యేది. అందుకే ‘రెండు వారాల్లో ఇంగ్లీష్ నేర్పిస్తా’ అంటూ కోచింగ్ సెంటర్ పెట్టి అందులో చురుకైన విద్యార్థులను దొంగతనం వైపు మళ్లించాడు. తొలుత క్లాస్‌లో థియరీ బోధించి, అనంతరం వారిని ఏటీఎంల వద్దకు తీసుకెళ్లి ప్రాక్టికల్స్ కూడా చూసి చూపించేవాడట. ఏటీఎంల వద్దకు వచ్చిన నిరక్షరాస్యులను, వృద్ధులకు సహాయం చేస్తామని చెప్పి వారు పిన్ ఎంటర్ చేయగానే ఓ పిన్ను కీప్యాడ్‌లో పెడతారు. దాంతో స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఏటీఎం పనిచేయడం లేదు, మరో చోటుకి వెళ్లండని చెబుతాడు. వారు వెళ్లగానే.. ఆ పిన్నునా తీసేసి డబ్బుల తీసుకుంటారు. ఇదే వారి ప్రణాళిక.
 
ఇలా చోరీలు చేస్తూ అతను భారీగా డబ్బులు కూడబెట్టాడు. సభ్యులకు కూడా భారీగా వాటాలు ఇవ్వడం మొదలెట్టాడు. జేబులో రూపాయి లేకుండా తిరిగిన రాజీవ్.. కొద్ది రోజులకే హోండా సిటీ కారులో తిరిగే స్థాయికి చేరుకున్నాడు. అయితే ఇది ఎంతో కాలం కొనసాగలేదు. కంప్లైంట్లు ఎక్కువవడంతో పోలీసులు నిఘా వేశారు. దీంతో అతను అరెస్టయి ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నాడో.. అక్కడికే చేరుకున్నాడు. మరి ఈ సారి జైలుకెళ్లిన మాస్టారు.. మరే విద్యలో నైపుణ్యం సాధించుకుని వస్తారో..? అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేస్తారో.. నిఘా పెట్టాల్సిన అవసరం వుంది

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ATM  Robbery  Spoken english  Rajiv Sahani atm  atm freeze  atm cracking  stealing money atm  

Other Articles