muni kamakoti died in chennai hospital

Muni kamakoti passed away

muni koti, muni kamakoti passed away, muni koti died, muni kama koti, bmk koti, suicide attempt, AP special status, congress protest, Congress activist mmolate self for AP special status, man set afire, muni koti, ke krishna moorthy, somireddy chandramohan reddy, Tirupati, Congress Activist set afire, Special Status for AP, Man sets himself ablaze, Congress-sponsered protest, Tirupati, youth commits suicide, muni koti, AP congress meet, Tirupati

muni kamakoti a local congress leader, who set ablave himself demanding special status for Andhra Pradesh, passes away

ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటి

Posted: 08/09/2015 02:26 PM IST
Muni kamakoti passed away

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానానికి సిద్ధమైన మునికామ కోటి(41) ప్రాణాలు కోల్పోయాడు. చెన్నైలోని కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశాడు. ఈ ఉదయం అతడిని వేలూరిలోని సీఎంసీ ఆస్పత్రి నుంచి  కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో అతడిని బతికించేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. మునికామ కోటి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

ఏపీకి ప్రత్యే హోదా ఇవ్వాలంటూ శనివారం తిరుపతిలో మునికామ కోటి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. మొదట అతడిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వేలూరు ఆస్పత్రికి తరలించారు. దాదాపు 95 శాతం శరీరం కాలిపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కోటి ఆరోగ్యం మెరుగుపడాలని కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ప్రత్యేక పూజలు ఫలించలేదు. కోటి బలిదానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

మునికామ కోటి మృతి విషయం తెలిసిన ఏపీ పిసీసీ ఛీప్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మునికోటి తన జీవితాన్ని త్యాగం చేశారని వారు అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యల వంటి తీవ్ర చర్యలకు యువత పూనుకోవద్దని రఘువీరా, చిరంజీవి పిలుపునిచ్చారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : muni koti  muni kama koti  bmk koti  suicide attempt  AP special status  congress protest  

Other Articles