journalist Ashok Pandey Building Part Demolished By MDDA For Revealing Mafia Scam | Sting Operation

Journalist ashok pandey building demolish for revealing mafia scam

Ashok Pandey, Ashok Pandey journalish, Ashok Pandey home demolished, Ashok Pandey, uttarakhand govt, uttarakhand mafia scam, indian scams,

journalist Ashok Pandey Building Demolish For Revealing Mafia Scam : Mussoorie Dehradun Development Authority (MDDA) caused quite a flutter when it demolished a part of an under-construction building which is belongs to journalist Ashok Pandey, ho dealt a blow to the Uttarakhand government last month when he aired a video allegedly featuring the chief minister's chief aide negotiating a deal for liquor licences.

అవినీతిని బయటపెట్టిన జర్నలిస్టు ‘కొంప కొల్లేరు’

Posted: 08/06/2015 10:45 AM IST
Journalist ashok pandey building demolish for revealing mafia scam

అవినీతి జరుగుతున్న చోట న్యాయానికి చోటు లేదని పెద్దలు అంటుంటారు. అవును.. ఈ మాటలు నూటికినూరు శాతం నిజమని ప్రతిఒక్కరు ఒప్పుకోక తప్పదు. ఇందుకు నిదర్శనంగా ఇదివరకే ఎన్నో ఘటనలు చోటు చేసుకోగా.. తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన కళ్లముందు జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు యత్నించిన ఓ జర్నలిస్టు కొంప కొల్లేరయ్యింది. ఓ భారతీయ పౌరుడిగా సక్రమంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఆ విలేకరికి చేదు అనుభవమే మిగిలింది. అతడు చేసిన సాహసానికి మెచ్చుకోవాల్సిన ప్రభుత్వమే అతనికి బజారులోకి ఈడ్చుకొచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ లో విలేకరిగా పనిచేస్తున్న అశోక్ పాండే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా ప్రసిద్ధి చెందారు. ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మహమ్మద్ షాహిద్ లిక్కర్ మాఫియాకు చెందిన కొంతమంది వ్యాపారులతో మద్యం లైసెన్సుల గురించి బేరసారాలు సాగించారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న అశోక్ పాండే.. వారిమధ్య జరుగుతున్న ‘అవినీతి’ బేరసారాలను బట్టబయలు చేయాలని నిర్ణయించారు. ఆయన అనుకున్నట్లుగా ‘స్టింగ్ ఆపరేషన్’ చేసి మరీ ఈ తతంగాన్ని రికార్డు చేశారు. అంతేకాదు.. సదరు భాగోతాన్ని బట్టబయలు చేశారు. అంతే! ఇక అప్పటినుంచి ఆ జర్నలిస్టుకు కష్టాలు మొదలయ్యాయి.

అప్పటిదాకా అన్నీ సవ్యంగానే ఉన్న అశోక్ పాండే ఇంటిని ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వెంటనే ముస్సోరి-డెహ్రాడూన్ డెవలప్ మెంట్ అథారిటీ(ఎంఎండీఏ)కి చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఎంఎండీఏ మంగళవారం అశోక్ పాండే ఇంటిలోని కొంత భాగాన్ని కూల్చేసింది. దీంతో ఆ విలేకరి తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashok Pandey  journalist house  uttarakhand scams  

Other Articles