KCR | Educuation System

Telangana cm kcr order to officials to renovate the eductions system in telangana

Telangana, CM, KCR, Educuation System, Gurukulam, Minority, KG to PG, Jobs, Technical education

Telangana cm KCR order to officials to renovate the eductions system in Telangana. He said that students must get jobs by their education.

బోడి చదవులు వేస్ట్.. ఉపాధి చూపే చదువులు రావాలి

Posted: 08/06/2015 08:37 AM IST
Telangana cm kcr order to officials to renovate the eductions system in telangana

చదువులు చదివిన వాడికన్నా గొర్రెకాచే వాడే మేలు.. అని మామూలుగా పెద్దవాళ్లు మాట్లాడే మాట. అయితే ప్రస్తుతం మన విద్యావ్యవస్థ కూడా అలానే ఉంది. పిజిలు, పిహెచ్డిలు చదివినా కానీ నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరిగే వాళ్ల సంఖ్య కోకొల్లలు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావిధానం మీద ఇదే కోణంలో సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు హోంగార్డులుగా, సెక్యూరిటీ గార్డులుగా, ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తుండటం సిగ్గుచేటని కేసీఆర్ అన్నారు. సాంకేతిక విద్యను సమూలంగా మార్చేయండని.... ప్రభుత్వమే గాక ప్రైవేటు రంగంలోనూ ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయని... వాటిపై దృష్టి పెట్టండి. ఆయా రంగాల అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందించండి. అని కేసీఆర్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేయండి  అని  కేసీఆర్ ఆదేశించారు. కేజీ టు పీజీ, ఉన్నత విద్యా రంగంపై ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అందులో భాగంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.

Also Read :  తెలంగాణ నిరుద్యోగ యువతకు తీపికబరు

చదువంటే ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమేనన్న భావనను పోగొట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సాంకేతిక విద్యలో మార్పులు తేవాలన్నారు. సమాజానికి అవసరమయ్యే సేవలేమిటి, అందుకు విద్యార్థులను ఎలా తయారు చేయాలి, ఏ వృత్తిలో ఎందరు అవసరం వంటి విషయాలను గుర్తించి చర్యలు చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించారు. ఐటీఐలనూ విద్యా శాఖే నిర్వహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగావకాశాలను గుర్తించి డిగ్రీలో తదనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. దీనిపై విద్యార్థులకూ అవగాహన కల్పించండి. పోటీ పరీక్షలంటే పబ్లిక్‌సర్వీసు కమిషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలేనన్న భావన పట్టభద్రుల్లో ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరెన్నో ఉద్యోగాలున్నాయని డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు తెలిసేలా చేయాలి. డిగ్రీ చదువుతూనే ఏం చేయాలో వారిలో స్పష్టత తేవాలి. డిగ్రీ కోర్సులను మరింత సమర్థంగా నిర్వహించాలి. అందుకవసరమైన లెక్చరర్ల నియామకాన్ని పూర్తి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

Also Read : తెలంగాణ ఉద్యోగ ప్రకటనలకు అంతా సిద్దం

పలు శాఖల కింద పనిచేస్తున్న రెసిడెన్షియల్ విద్యా సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని ఆదేశించారు. ప్రస్తుతం 668 గురుకులాలుండగా, నియోజకవర్గానికి సగటున 10 చొప్పున వాటిని రాష్ట్రవ్యాప్తంగా 1,190కి పెంచాలన్నారు. 12వ తరగతి వరకు వాటిలో పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించాలని, ఎస్సీ, ఎస్టీలందరికీ ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. ‘‘ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకులాలు మెరుగ్గా నడుస్తున్నాయి. అన్నీ అదే నమూనాలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ తదితర విభాగాలుగా గురుకులాలు నడుస్తుండటం, ఒక్కోదాంట్లో ఒక్కో విధానం, ఒక్కోరకం మెస్ చార్జీలుండటం సరికాదు. అన్నింటిలో ఒకే రకమైన విద్య, వసతులు కల్పించండి. విద్యార్థులకు గ్రాముల చొప్పున భోజనమేమిటి? ఇకపై అలా కాకుండా బఫే పద్ధతిలో వారికి తిన్నంత భోజనం పెట్టాలి’’ అని ఆదేశించారు. ‘‘పిల్లలు నాలుగో తరగతి దాకా తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలి. ఆ మేరకు గ్రామ స్థాయిలోనేవిద్యా బోధన జరగాలి. తరవాత మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పాలి’’ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM  KCR  Educuation System  Gurukulam  Minority  KG to PG  Jobs  Technical education  

Other Articles