KCR | Convoy | Cars

Telangana cm kcr purchase new cars for his convoy

KCR, Convoy, Cars, KCR convoy, Telangana cm

Telangana cm KCR purchase new cars for his convoy. KCR buy five new cars each worth 1crore 38 lakh.

సొమ్ములెవరివో.. సోకులు మాత్రం కేసీఆర్ వి

Posted: 08/06/2015 10:45 AM IST
Telangana cm kcr purchase new cars for his convoy

సొమ్మొకడిది.. సోకొకడిది అనే సామెత అందరికి తెలిసే ఉంటుంది. ఎవరికో చెందిన వాటి మీద ఎవరో అజమాయిషీ చెలాయిస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ పరిస్థితి అసలే బాగోలేదు.. ఖజానాలో కాసులు లేక దివాళా దిశగా అడుగులు వేస్తోంది కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఖజానా పరిస్థితిని పట్టించుకోకుండా ఖర్చు మీద ఖర్చు చేసేస్తున్నారు. ఇంతకీ సార్ గారు ఏం చేశారు అనేగా మీ అనుమానం. ఖరీదైన కోట్ల విలువ చేసే కార్లను సిఎం కాన్వాయ్ లోకి తీసుకున్నారు కేసీఆర్. అవును అందులో తప్పు ఏముంది అనుకుంటున్నారా....? ఆగండి సార్ ఒక్క కారుకు ఖర్చు చేసింది ఎంతో తెలుసా..? అక్షరాల నాలుగుకోట్ల 38 లక్షల రూపాయలు. అవును నాలుగు కోట్ల  ముప్పై ఎనిమిది లక్షలే. అసలే కాసులకు కటకట ఉంటే కేసీఆర్ మాత్రం బిల్డప్ కోసం కొత్త కార్లు కొన్నారని అపవాదు మూటగట్టుకున్నారు.

.Also Read :  కేసీఆర్ బస్సు 5 కోట్లు.. మరి చంద్రబాబు బస్సు...?

తెలంగాణ రాష్ట్రం నిజానికి దేశంలో మిగులు బడ్జెట్ కలిగి ఉన్న రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. కానీ గత కొంత కాలంగా ప్రభుత్వం చేస్తున్న అనవర ఖర్చు ప్రభుత్వానికి రూపాయి మిగలకుండా చేస్తోంది. అవసరమైన దాని కన్నా అతిగా ఖర్చు చెయ్యడం కేసీఆర్ సర్కార్ కు అలవాటుగా మారింది. అందుకే ప్రస్తుతం తెలంగాణ ఖజానా కాసులు లేక వెలవెలబోతోంది. అయినా ఇంత తడిసిమోపడవుతున్నా కేసీఆర్ మాత్రం తన పంధా మార్చుకోవడం లేదు. తాజాగా నాలుగు కొత్త కార్లను కొని తన కాన్వాయ్ లోకి చేర్చారు.

.Also Read : కేసీఆర్ బస్సు.. ఐదు కోట్లు కానీ కనీసం బెడ్ కూడా లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాన్వాయ్ ముచ్చటగా మూడోసారి మారింది. అత్యాధునిక భద్రతతో పాటు… అత్యంత ఖరీదైన వాహనాలు సీఎం కాన్వాయ్ లో కనిపించనున్నాయి. దేశంలో ప్రధాని, రాష్ట్రపతి తర్వాత అత్యంత ఖరీదైన కాన్వాయ్ ని కేసీఆర్ మాత్రమే వాడుతున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా టయోటా కంపెనీకి చెందిన ఫార్చూనర్లనే వాడుతూ వస్తున్న కేసీఆర్, తన పంథా మార్చారు. ఫార్చూనర్ల స్థానంలో అత్యంత ఖరీదైన వాహనాలుగా పేరుపడ్డ ల్యాండ్ క్రూయిజర్లను కేసీఆర్ ఎంచుకున్నారు. ఒక్కోటి రూ.1.30 కోట్ల విలువ కలిగిన ఐదు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలు ఆయన కాన్వాయ్ లో చేరిపోయాయి. తద్వారా అత్యంత ఖరీదైన వాహన శ్రేణి కలిగిన సీఎంల జాబితాలో కేసీఆర్ చేరిపోయారు.అత్యంత ఖరీదు పెట్టడమే కాక ఈ వాహనాలను బుల్లెట్ ప్రూఫ్ కూడా చేయించారట. ఇక ఇప్పటిదాకా వాడిన ఫార్చూనర్లు నలుపు రంగులో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇవి తెలుపు రంగులోకి మారిపోయాయి. తాజాగా కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూయిజర్లు కూడా తెలుగు రంగులోనే కేసీఆర్ కాన్వాయ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. యాదగిరిగుట్టలో కొత్త ల్యాండ్ క్రూయిజర్లకు ప్రత్యేక పూజలు చేయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Convoy  Cars  KCR convoy  Telangana cm  

Other Articles