15 thousand government jobs to be filled in telangana

Telangana government to recruit 15 thousand government jobs

telangana, government jobs, recruitment, kcr, 15 thousand government jobs, police and allied departments 8000 jobs, electrical department, green signal to recruitment, age limit relaxation, cm kcr signed employment file, recruitment in to 15 departments, medical department, muncipal department, excise department, telangana unemployed youth, how to apply goverment jobs in telangana

telangana government gives good news to unemployed youth in telangana, as it is going to recruit 15 thousand government jobs

తెలంగాణ నిరుద్యోగ యువతకు తీపికబరు

Posted: 07/25/2015 09:43 PM IST
Telangana government to recruit 15 thousand government jobs

గోదావరి పుష్కరాల ముగింపు వేడుకల రోజున తెలంగాణ నిరుద్యోగుల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుభవార్తను అందించారు. గత 14 మాసాల నుంచి ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం తీపికబురును అందించింది. తెలంగాణలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపట్టేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత ఫైలుపై ఆయన సంతకాలు చేశారు. తెలంగాణకు సంబంధించిన 15 శాఖల్లో 15 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆయన పచ్చజెండాను ఊపారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో గత ఐదారేళ్లుగా ఉద్యోగాలు లభించని నిరుద్యోగులకు కూడా తెలంగాణ ప్రభుత్వం తీపికబరును అందించింది. అభ్యర్థుల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు సడలించి.. మరో పదేళ్లను పెంచింది. మొదటి దశలో వ్యవసాయం, వైద్యశాఖ, మున్సిపల్, విద్యత్, ఎక్సైజ్ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోలీసు అనుబంధ శాఖల్లో 8 వేల ఉద్యోగాలను విద్యుత్ శాఖలో 2 వేల 681 ఖాళీలను, మిగిలిన శాఖల్లో 4300 ఉద్యోగ నియామకాలకు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి ఉద్యోగ కల్పన, నియామకాలపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ దిశగా నిర్ణయాలు తీసుకోవడంతో తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  government jobs  recruitment  kcr  green signal  

Other Articles