Chandrababu naidu | ap | telangana | financial commiission, budget, surplus

Ap cm chandrababu naidu said that telangana surplus budget for his effort

Chandrababu naidu, ap, telangana, financial commiission, budget, surplus

Ap cm Chandrababu naidu said that Telangana surplus budget for his effort. Chandrababu naidu discuss about the facilities to attract investments to ap.

సేమ్ డైలాగ్.. తెలంగాణ మిగులు బడ్జెట్ నా వల్లే అన్నారు

Posted: 07/21/2015 03:45 PM IST
Ap cm chandrababu naidu said that telangana surplus budget for his effort

ఇవాళ తెలంగాణకు మిగులు ఆదాయం ఉందంటే అది తన వల్లే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పారు. ఆనాడు తాను రూపొందించిన విజన్ వల్లే.. ఇవాళ అభివృద్ధిలో హైదరాబాద్ దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉందని ఆయన అన్నారు. రాజమండ్రిలో పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న  చంద్రబాబు ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్దిపై ఆయన చర్చించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో నాల్డెజ్ బేస్ ఎకానమీ, ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని.. నేడు అదే హైదరాబాద్ కు ప్రధాన ఆదాయాన్ని చేకూరుస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తాతాల్కిక సమస్యల్లో ఉందన్నారు చంద్రబాబు.

Also Read:  అదిరిపోయేలా.. అపూర్వంగా అమరావతి నిర్మాణం: బాబు

రెవెన్యూ లోటు ఉంటుందని 14th ఫైనాన్స్ కమిషన్, విభజన చట్టం చెప్పయని ఆయన గుర్తు చేశారు. అయితే పారిశ్రామిక్తవేత్తలు కలిసి వస్తే.. దేశంలోనే ఏపీని నెంబర్ 1 చేసే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా పోర్టు ఉండాలని చంద్రబాబు అన్నారు. ఇవాళ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు చైనా, సింగపూర్, మలేసియా.. ఇలా ఏవి చూసినా.. ఆయా దేశాలకు పోర్టులు ఉండటమే ప్రధాన కారణం అన్నారు. అందుకే ఏపీకి కూడా డెవలప్ కావాలంటే పోర్టు తప్పనిసరి అన్నారు చంద్రబాబు. ఏపీలో సహజ వనరులకు కొదవలేదన్న చంద్రబాబు.. మనమంతా సమిష్టిగా పని చేస్తే దేశంలోనే ఏపీ నెంబర్ వన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక గోదావరి పుష్కరాలకు అనూహ్య స్పందన వచ్చిందని, ఇప్పటివరకు 3 కోట్ల మందికిపైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారని చంద్రబాబు వెల్లడించారు.

Also Read:  చంద్రబాబు అంతే చెప్పారంటున్న బోయపాటి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  ap  telangana  financial commiission  budget  surplus  

Other Articles