Modi | Kejriwal | Social Media | Twitter, Comments, Thullakejri, Nithallamodi

A hashtag battle between thullakejri and nithallamodi

Modi, Kejriwal, Social Media, Twitter, Comments, Thullakejri, Nithallamodi

A hashtag battle between ThullaKejri and NithallaModi The ongoing tug-of-war between chief minister Arvind Kejriwal and Delhi Police was reflected on social media as #ThullaKejri became the top Twitter trend morning, the game changed with #NithallaModi emerging as the top trend.

తిట్లు తినడంలో మోదీ, కేజ్రీవాల్ పోటీ.. నెట్ లో హల్ చల్

Posted: 07/21/2015 01:15 PM IST
A hashtag battle between thullakejri and nithallamodi

ప్రధాని నరేంద్ర మోదీకి, సోషల్ మీడియాకు ఉన్న సంబందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాను మోదీ వాడినట్లు ఎవరూ వాడరు కూడా. అయితే మోదీకి, కేజ్రీవాల్ కు మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. వార్ అనగానే ఎన్నికల సమయంలో జరిగే వార్ లాంటిది కాదు. మోదీకి పోటీగా కేజ్రీవాల్ కూడా పోటీ పడుతున్నారు. అయితే ఇదంతా చూసి మోదీకి, కేజ్రీవాల్ భలే పోటీ అనుకుంటున్నారేమో అస్సలు కాదు. ఎందుకు అంటారా..? వీళ్లు పోటీ పడుతున్నది ఎందులో తెలుసా..? విమర్శల్లో అవును నెటిజన్లు మోదీని ఎంతలా తిడుతున్నారో అలాగే కేజ్రీవాల్ ను కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అయినా పోటీ అంటే ఎందులో అయినా ఒకటే అనుకున్నారో ఏమో కానీ తెగ హడావిడి చేస్తున్నారు.

తీవ్ర పదజాలంతో పోలీసులను తిట్టిన దిల్లీ సిఎం కేజ్రీవాల్ మీద సోషల్ మీడియాలో ఒక్కటే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే లలిత్ మోదీ, వ్యాపం స్కాం లాంటివి జరుగుతున్నా కానీ మోదీ కనీసం మాట కూడా మాట్లాడకపోవడం మీద సర్వత్రా విమర్శలు కురిపిస్తున్నారు. అయితే మొత్తానికి అటు మోదీని, ఇటు కేజ్రీవాల్ ను నెటిజన్లు సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు.

kajri-modi-social-media

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Kejriwal  Social Media  Twitter  Comments  Thullakejri  Nithallamodi  

Other Articles