Amaravathi | Chandrababu naidu | Singapur | Master Plan | Seed Capital, Rajahmundry

Nara chandrababu naidu said that amaravathi will mesmerise all

Amaravathi, Chandrababu naidu, Singapur, Master Plan, Seed Capital, Rajahmundry

Nara Chandrababu naidu said that Amaravathi will mesmerise all. Chandrababu Naidu very happy on seed capital master plan.

అదిరిపోయేలా.. అపూర్వంగా అమరావతి నిర్మాణం: బాబు

Posted: 07/21/2015 08:05 AM IST
Nara chandrababu naidu said that amaravathi will mesmerise all

రాజధాని నగరాన్ని అపూర్వంగా తీర్చిదిద్దుతానని ఏపి సిఎం చంద్రబాబు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకునే రీతిలో దీన్ని నిర్మిస్తామన్నారు. కృష్ణానది ఒడ్డునున్న కారణంగాఈ ప్రాంతంలో భూకంపాలకు ఆస్కారం ఉందన్నారు. వాటిని తట్టుకుని నిలబడే విధంగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. ఈ నగర నిర్మాణంలో భాగస్వామి కావాల్సిందిగా సింగపూర్‌ ప్రభుత్వాన్ని కోరామన్నారు. అక్టోబర్‌ 22న రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రజారాజధానిని సకాలంలో నిర్మించి చూపుతామన్నారు.

Also Read:  సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ సూపర్.. అంతా మంచే అంటున్న బాబు

నిర్ణీత సమయానికే ప్రణాళికల్ని సిద్ధం చేయడం ద్వారా సమయం విలువను సింగపూర్‌ ప్రభుత్వం నిరూపించిందన్నారు. అలాగే నిర్దిష్ట సమయంలోగా నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. కేవలం డబ్బులతోనే పనులన్నీ పూర్తికావని చంద్రబాబు చెప్పారు. పనిపై నిబద్దత, నిజాయితీ ఉండాలన్నారు. వారంతా తమపై ఎంతో విశ్వాసం ఉంచారన్నారు. వారి ఆశల్ని, ఆశయాల్ని నిలబెడతానన్నారు. తక్కువ భూమిలో ఎక్కువ సంఖ్యలో కార్యాలయాలు ఏర్పాటయ్యేలా నిర్మాణాల్లో మార్పులు తెస్తామన్నారు.

Also Read: అమరావతి సీడ్ కేపిటల్ ప్లాన్ ఇదే

నూతన రాజధాని నిర్మాణ సమయంలో తాను అమరావతిలోనే మకాం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి అంశాన్ని తాను వ్యక్తిగతంగా పరిశీలిస్తానన్నారు. రోజువారి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అందుకనుగుణంగా నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. నగర నిర్మాణంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని పరిరక్షిస్తామన్నారు. ఇంతవరకు అలైన్‌మెంట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. ఇప్పటికే భూసమీకరణ వేగంగా జరిగిందన్నారు. ఇంకా కొంతమంది రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. వారంతా తమ విధానాల్ని మార్చుకోని పక్షంలో చట్టపరంగా భూసేకరణకు సిద్ధపడతామన్నారు. అయితే ఈ ప్రక్రియలో ఎవరికీ నష్టం వాటిల్లకుండా చూస్తామన్నారు. రాజధాని నిర్మాణంలో కేంద్రం సహకారం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిచూపించా.. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించా.. ఎక్కడా ఏ చిన్న అవకతవకలు జరగలేదు. అమరావతి నిర్మాణం, అభివృద్ధిలోనూ అదే విధమైన సూత్రాల్ని పాటిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read:  చంద్రబాబుకు మద్దతుగా వర్మ వివాదాస్పద ట్వీట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravathi  Chandrababu naidu  Singapur  Master Plan  Seed Capital  Rajahmundry  

Other Articles