Pawan Kalyan | tweets | twitter | Pawan Kalyan janasena | Janasena party | janasena Updates

Pawankalyan tweets about the youth

Pawan Kalyan, tweets, twitter, Pawan Kalyan janasena, Janasena party, janasena Updates

PawanKalyan tweets about the youth. Pawan kalyan tweet a poetry by the shailender varmas narration.

యువత గురించి పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్

Posted: 07/11/2015 01:36 PM IST
Pawankalyan tweets about the youth

పవన్ కళ్యాణ్.. తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న పేరు. పేరంటే కేవలం పేరుగా కాకుండా పవర్ గా చాలా మంది భావిస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న, జరిగిన వివాదాల మీద ట్విట్టర్ లో ట్వీట్ చేస్తేనే రాజకీయ ప్రకంపనలు పుట్టాయి. రెండు రాష్ట్రాల నాయకులు దీని మీదే చర్చించుకున్నారు రాజకీయ నాయకులు అంటే గంటల గంటల ఊకదంపుడు ఉపన్యాసాలు కూడా ఇవ్వ లేదు కేవలం మూడు లైన్లలో చెప్పాలనుకున్న విషయాన్ని ట్వీట్ చేశారు. అయితే ట్విట్టర్ లో ట్వీట్లు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం కలిగించాయో అందరికి తెలుసు. అయితే తాజాగా మరోసారి ట్వీట్లు చేశారు. అయితే ఈ సారి మాత్రం ఎవరిని టార్గెట్ గా చెయ్యలేదు. యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

Also Read:  ఫుల్ టైం పాలిటిక్స్ లోకి పవన్ కళ్యాణ్

కొద్దిరోజులుగా వరస ట్వీట్లలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కాక పుట్టించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి ట్వీట్‌ చేశారు. యువతకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించాడు. యుద్ధము, రక్తం, కన్నీరు తప్ప యువతరానికి మనం ఏమీ ఇవ్వలేక పోతున్నామంటూ ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ కవితను ట్విట్టర్‌లో పెట్టాడు.  గాయాలు బాధలు వేదనలు,  కలలు, పిరికితనం మోసం మాత్రమే మిగిలిందని ఉటంకించారు కవి శేషేంద్రవర్మ.  పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించడానికి ముందు ఎంతో మంది యువకులు పార్టీ పెట్టాలని పవన్ మీద వత్తిడి చేశారు. పార్టీ పెట్టిన తర్వాత ఎంతో మంది పవన్ కళ్యాణ్ ఏదో చెయ్యబోతున్నారు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ యువతరాన్ని ఉద్దేశించి ట్వీట్లు చెయ్యడంతో వేగంగా పవన్ ట్వీట్ల గురించి తెలిసి, సర్వత్రా చర్చ జరుగుతోంది.

pawankalyan-poetry

Also Read:  పవన్ కళ్యాణ్ చెప్పేదాకా.. తెలియదా..?

భారతదేశం.. అనే కన్నా చాలా మంది యువబారతం అని అంటారు. ఎందుకంటే భారత్ సూపర్ వపర్ గా ఎదగడానికి అతి పెద్ద ప్లస్ యువతే. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా భారత్ లోనే యువ జనాభా అధికంగా ఉంది. అందుకే రానున్న దశాబ్దంలో భాకత్ అగ్రరాజ్యాల సరసన చేరుతుందని, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ కూడా ఉంటుంది అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అసలు నిజాలు ఎలా ఉంటాయో యువతకు మాత్రమే తెలుసు. రాజకీయ నాయకులు మన దేశ యువత గురించి ఎన్ని ప్రగల్భాలు పలికినా కానీ వాస్తవానికి మన ముందు తరాలకు ఇస్తున్నది.ప. వెనకి తరాలు మనకు ఇచ్చింది ఏంటీ అన్నదానిపై పవన్ వ్యాఖ్యానించారు.

By Abhinavachary

Also Read:  అప్పుడు ఎక్కడికెళ్లారు అని ప్రశ్నించిన పవన్.. మరోసారి ఏపీ ఎంపీలను నిలదీశారు
Also Read:  పవన్ ను ప్రశ్నించే వాళ్లు ముందు వీటికి జవాబు చెప్పండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  tweets  twitter  Pawan Kalyan janasena  Janasena party  janasena Updates  

Other Articles