Hyderabad | Muncipal employees | KCR | strike

Muncipal employees strike getting problems to hyderabadis

Hyderabad, Muncipal employees, KCR, strike

Muncipal employees strike getting problems to hyderabadis. Telangana govt didnt agree the muncipal employees damends the strike is going on.

హైదరాబాద్ లో కంపు కొట్టును.. ముక్కులు అదురును

Posted: 07/11/2015 12:00 PM IST
Muncipal employees strike getting problems to hyderabadis

విశ్వనగరంగా హైదరాబాద్.. ఇదే నా లక్ష్యం అంటూ బీరాలు పలికిన కేసీఆర్ మాటలు ఉస్సేన్ సాగర్ లో కలిశాయి. హైదరాబాద్ లో వస్తున్న కంపుకు రోడ్ల మీద జనాలు ముక్కు మూసుకొని తెలంగాణ ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. అసలే సవాలక్ష సవాళ్లతో ఉక్కిరిబిక్కిరి అయ్యే జనాలకు తాజాగా చెత్తకంపు మరింత చికాకు తెప్పిస్తోంది. మున్సిపల్ కార్మికుల సమ్మెతో హైదరాబాద్ కంపు విశ్వవ్యాప్తం అయ్యేలా ఉంది. మా ఊరు చూడు మా ఊరి అందాలు చూడు అని నిన్నటి దాకా గొప్పగా చెప్పుకున్న హఐదరాబాదీలు సిగ్గుతో తల దించుకుంటూ, కంపుతో ముక్కు మూసుకుంటున్నారు. తెలంగాణలో కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది.. కార్మికుల వేతనాల పెంపు విషయంలో రాజీ పడేది లేదని చెబుతున్నారు. సీఎం ప్రకటన చేస్తేనే సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాల నేతలు తేల్చిచెప్పారు.ఇవాళ ఇందిరాపార్క్‌ దగ్గర భారీ బహిరంగసభకు సిద్ధమౌతున్నాయి కార్మిక సంఘాలు.  

Also Read:  ఇక స్వచ్ఛ హైదరాబాద్

మున్సిపల్‌ కార్మికుల సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయింది.ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.రోడ్లపై జనాలు నడిచి వెళ్లలేని పరిస్థితులు ఏర్పాడ్డాయి.మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిపై పనులు చేయడానికి కార్మికులను నియమించుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే పోలీసుల సహకారంతో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించింది. మరోవైపు ఏపీలో కూడా మున్సిపల్ కార్మికుల సమ్మె రెండోరోజుకు చేరింది. విధులు బహిష్కరించిన కార్మికులు మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన దిగారు.

Also Read:  హైదరాబాద్ పోలీసులకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్


మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరూ రోడ్డెక్కి ఉద్యమాలు చెయ్యాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరికి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చేసిపెడతాం అని కోటలు దాటిని కేసీఆర్ మాటలు చెత్తకుండీల్లో ఉంటున్నాయి. నీళ్లలో ఉన్నప్పుడు ఓడ మల్లన్న .. నది దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నటలుగా కేసీఆర్ పాలన సాగుతోంది. మున్సిపల్ ఉద్యోగులు తమ సమస్యల మీద నోటిసులు ఇచ్చినా పట్టించుకోని ప్రభుత్వం కనీసం సమ్మెకు దిగిన తర్వాతైనా స్పందించాల్సింది కానీ అలా చెయ్యకుండా పీక్స్ వరకు వచ్చేలా చేసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ కంపు కొడుతోంది.. అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తూ సమ్మెను మరింత ఉదృతం చేశారు మున్సిపాలిటీ సిబ్బంది. మరి ఇది ఎంత వరకు వెళుతుందో చూడాలి.

By Abhinavachary

Also Read:  హైదరాబాద్ కు కొత్త కళ: కేసిఆర్
Also Read:  కేసీఆర్ కు అప్పుడే చుక్కలు కనబడుతున్నాయ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Muncipal employees  KCR  strike  

Other Articles