Telangana | Deficit account | Budget | KCR | Eetala Rajender | Ramdan, Pushkaralu, Budget defecience

Telangana gi ovt facing deficit problem in the finance department

Telangana, Deficit account, Budget, KCR, Eetala Rajender, Ramdan, Pushkaralu, Budget defecience

Telangana gi\ovt facing deficit problem in the finance department. Telangan govt lack of fund for Puashkaralu and Ramdan celebrations.

తెలంగాణ ఖజానాకు కటకట.. చాలా కష్టం

Posted: 07/10/2015 08:44 AM IST
Telangana gi ovt facing deficit problem in the finance department

చచ్చిన ఆవు పగిలిపోయిన కుండ నిండా పాలు ఇచ్చేది. కానీ వచ్చిన ఆవు మాత్రం అంత ఇవ్వడం లేదు అని ఓ నానుడి. పాలిచ్చిన ఆవు లేదు, కనీసం కుండ కూడా లేదు. ఇప్పుడు తెలంగాణ ఖజానా పరిస్థితి కూడా ఇలానే ఉంది. దేశంలొని మిగులు బడ్జెట్ లు కలిగిన రాష్ట్రాల్లో గుజరాత్ తర్వాత తెలంగాణ పేరు ఉంది. అయితే పేరేమో గొప్ప ఊరేమో దిబ్బ అన్నట్లుంది పరిస్థితి. నిన్నటి దాకా బడ్జెట్ లో డబ్బులు ఉన్నాయి కదా అని తెలంగాణ సర్కార్ ఇష్టంవచ్చినట్లు డబ్బులను నీళ్లలా ఖర్చుచేసింది. కానీ ఇప్పుడు మాత్రం నిధులు లేక కటకటా అంటోంది. తాజాగా రంజాన్ కు ప్రతి ముస్లిం కుటుంబానికి రెండు చీరలు, కుర్తా పైజామా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే త్వరలో ప్రారంభం కానున్న పుష్కరాలకు కూడా నిధులు లేనంతగా తెలంగాణ సర్కార్ కష్టాలుపడుతోంది.

Also Read:  బడ్జెట్ అంటే ప్రజలతో మమేకమైన ప్రగతి

తెలంగాణ సర్కార్ ఖనాజా ఖాళీగా బోసిపోతోంది. తెలంగాణ ప్రభుత్వ ఖజానా నగదు నిల్వలు లేక బోరుమంటోంది. చివరికి ఖర్చుల కోసం బాండ్లు జారీ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. బ్రూవరేజెస్‌ కార్పొరేషన్‌ చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 1260 కోట్లను రిజర్వు బ్యాంకు తీసేసుకోవడంతో తెలంగాణకు కష్టాలు తీవ్రమయ్యాయి. అంతకుముందే రైతుల రుణమాఫీ కోసం 2250 కోట్లు బ్యాంకులకు విడుదల చేయాల్సి వచ్చింది. దీనికి తోడు నెలాఖరుకాగానే, ఉద్యోగుల జీతాల కోసం వెయ్యి కోట్లు విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో ఖజానా ఖాళీ అయిపోయింది. నగదు నిల్వలు పూర్తిగా కరిగిపోయాయి. చివరాఖరికి కోటి రూపాయలను విడుదల చేయాల్సి వచ్చినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్యమంత్రి అనుమతి తీసుకుంటున్నారు.

Also Read:  ఇక్కడ అమ్మితే ఇక్కడే పన్ను కట్టాలి...!!

ఆర్థిక శాఖ అన్ని బిల్లుల చెల్లింపులను దాదాపుగా నిలిపివేసింది. ఉచిత విద్యుత్‌కు ఇవ్వాల్సిన నిధుల విడుదలను ఆపేసింది. రోడ్లు భవనాల శాఖకు చిల్లగవ్వ రాలడం లేదు. నీటిపారుదల శాఖలో పెద్దగా ఖర్చు లేనప్పటికీ... మిషన్‌ కాకతీయ బిల్లులను కూడా ఇవ్వడం లేదు. ఐటీ శాఖకు మళ్లించిన 1260 కోట్ల రూపాయలను అడ్వాన్సు రూపంలోనైనా ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కేంద్రం చెవికెక్కించుకోవడంలేదు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో రోజుకు ఐదారుసార్లు మాట్లాడి అలసిపోతున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్రతోపాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ కూడా కల్పించుకుంటున్నారు. అయినప్పటికీ... ‘చూద్దాం... చేద్దాం’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు మాటలు మాత్రమే చెబుతున్నారు.

Also Read:  తొలి బడ్జెట్ తో అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకున్న ప్రభుత్వం
 
ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు మరో మార్గం లేకపోవడంతో... సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా బహిరంగ మార్కెట్‌ నుంచి 1500 కోట్ల రుణం సేకరించాలని గురువారం తెలంగాణ ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆ మేరకు రిజర్వు బ్యాంకుకు విజ్ఞప్తిని పంపించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రెండుసార్లు సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా 3400 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ సేకరించింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,500 కోట్ల వరకు రుణాన్ని బహిరంగ మార్కెట్‌ నుంచి తెలంగాణ ప్రభుత్వం సేకరించవచ్చు. ఇటీవల నగరానికి వచ్చిన నీతీ ఆయోగ్‌ ఉపాధ్యక్షుడుని ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3.5 శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ఇందుకు నీతీ ఆయోగ్‌ సరేనంటే, మరింత రుణం సేకరించవచ్చు

By Abhinavachary

Also Read:  బడ్జెట్ ప్రసంగం పూర్తికాకుండానే విపక్షాల వాకౌట్..
Also Read:  రూ.లక్షా 15వేల 689 కోట్లుతో తెలంగాణ బడ్జెట్..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Deficit account  Budget  KCR  Eetala Rajender  Ramdan  Pushkaralu  Budget defecience  

Other Articles