Congress bjp tdp mals walk out of assembly over budget uttam kumar reddy says etela budget a disappointed

Telangana assembly, telangana budget, eetela rajender, Uttam kumar reddy, walkout, congress, bjp, tdp

congress, bjp, tdp mals walk out of assembly over budget, Uttam kumar reddy says etela budget a disappointed

బడ్జెట్ ప్రసంగం పూర్తికాకుండానే విపక్షాల వాకౌట్..

Posted: 11/05/2014 05:35 PM IST
Congress bjp tdp mals walk out of assembly over budget uttam kumar reddy says etela budget a disappointed

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు ఆత్మహత్యలపై ప్రస్తావన లేకపోవడం.. ఎండిపోయిన పంటల అంశం, వాటికి చెల్లించే పరిహారం అంశాలు లేకపోవడంపై తాము నిరసిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రభుత్వం పాలనపరమైన చర్యలు తీసుకోకుండా కేవలం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వ్యవహరించినందుకు నిరసనగానే సభ నుంచి వాకౌట్ చేసినట్లు వారు తెలిపారు. శాసనసభలో ఈటెల బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకుండానే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేయడా, అదే బాటలో బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతుల ఆత్మహత్యలపై ప్రస్తావన లేకపోవడంతో శాసనసభలో బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకుండానే విపక్షాలు వాకౌట్ చేశాయి. రైతుల ఆత్మహత్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న విద్యుత్‌ సమస్యలపై బడ్జెట్‌లో సరైన ప్రతిపాదనలేదన్నారు. బడ్జెట్‌ను చూస్తుంటే తెలంగాణ విద్యుత్‌ కష్టాలు కొనసాగుతాయని ఉత్తమ్‌కుమార్‌ అన్నారు.

 కాంగ్రెస్‌ పార్టీ పాలనను నిందించడం తప్ప ఏమీ లేదని, గత ప్రభుత్వాలను నిందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్‌దారులను పెంచాలని అయితే అర్హులైన పెన్షన్‌దారులకు తగ్గిస్తే ఊరుకునేది లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన పథకాలను ఈ బడ్జెట్ లో పెట్టుకోవడం చాలా దారుణమన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం విధానమేంటో బడ్జెట్ లో తెలుపలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana assembly  telangana budget  eetela rajender  Uttam kumar reddy  walkout  congress  bjp  tdp  

Other Articles