Eetala rajender tables rs one lakh 637 cr maiden budget for 10 months

Telangana assembly, telangana budget, budget high lights, eetela rajender, Telangana Cm, KCR

eetala Rajender tables Rs one lakh 637 cr maiden budget for 10 Months

తొలి బడ్జెట్ తో అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకున్న ప్రభుత్వం

Posted: 11/05/2014 03:31 PM IST
Eetala rajender tables rs one lakh 637 cr maiden budget for 10 months

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఘట్టం పూర్తైంది. స్వయం పాలన, స్వరాష్ట్ర కాంక్షతో దేశంలో 29వ రాష్ట్రంగా అవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ను తెలంగాణ రాష్ట్ర అర్థికశాఖా మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గతంలో సాగిన సంప్రదాయాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజునే ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. స్పీకర్ మధుసూదనాచారి అనుమతితో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర 2014-15 బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజనతో తెలంగాణకు ఆదాయం తగ్గుతుందన్న అంచాలను ఫటాపంచలు చేస్తూ.. ఈటెల లక్ష కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్ర మొత్తం బడ్జెట్ ను లక్షా 637 కోట్ల రూపాయలగా వుందని అయన చెప్పారు.

ప్రణాళిక వ్యయం 48,648 కోట్ల రూపాయలుగా చెప్పిన వుందని, ప్రణాణికేతర వ్యయం రూ.51,989 కోట్లని చెప్పారు. 17 వేల 398 కోట్ల రూపాయల బడ్జట్ లోటుగా ఆయన చెప్పుకోచ్చారు. ముందుగా చెప్పిన ప్రకారం సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేస్తామని చెప్పిన ఈటెల ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.7,579 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.4,559 కోట్లు,  బీసీల సంక్షేమానికి రూ.2022 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.1030 కోట్లు, కల్యాణ లక్ష్మి( ఎస్టీ) పథకానికి రూ.80కోట్లు,  మైనార్టీల షాదీ ముబారక్ పథకానికి రూ.100కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి రూ.221కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అటు తెలంగాణ వికలాంగులకు పింఛన్లను 500 నుంచి 15 వందల రూపాయలకు పెంచుతున్నట్లు చెపిన్న ఈటెల అదే తరహాలో వృద్దాప్య, వితంతు పింఛన్లను 200 నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

దీంతో పాటు బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి మూడున్నర లక్షల రూపాయల చోప్పున కేటియిస్తున్నట్లు చెప్పారు. దీపం పథకానికి 100 కోట్ల రూపాయలను కేటాయించి మహిళలను ప్రసన్నం చేసుకున్నారు. దళితుల భూ పంఫిణీకి ప్రభుత్వ భూమి లేని పక్షంలో భూమి కోని ఇచ్చేందుకు వెయ్యి కోట్ల రూపాయలు, సాంస్కృతిక, క్రీడారంగంలో విద్యార్థులను ప్రోత్సహించి, వారికి మంచి శిక్షణ కల్పించేందుకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో పాటు విద్యాశాఖలోని అన్ని విభాగాలకు 10 వేల 956 కోట్ల రూపాయలను కేటాయించారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటికీ ఈటెల తన బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారు.

అటు అభివృద్ది రంగానికి కూడా ఈటెల పెద్దపీట వేశారు.  తెలంగాణలోని అన్ని రహదారుల అభివృద్ధికి .10 వేల కోట్ల రూపాయలను కేటాయించిన ఆయన, అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లాలకు వెళ్లే దారులను డబుల్ రోడ్లుగా మారస్తామని చెప్పారు. :ఇందుకుగాను రూ.400 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణలో చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. రాష్ట్రంలోని 9వేల చెరువుల పూడిక తీత, అబివృద్దిక రూ.2వేల కోట్ల కేటాయించారు. తెలంగాణలో దెబ్బతిన్న 45వేల చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పారు.

విద్యుత్ రంగానికి మొత్తం రూ.3241 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఈటెల ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. విద్యత్ లోటు నుంచి రానున్న ఐదేళ్లలో బయటపడి, విద్యుత్ విక్రయించే స్థాయికి చేరుకుంటామని ఈటెల వెల్లడించారు. ఎన్టీపీసీ ద్వారా అదనంగా 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం జెన్కోలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ... సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఉద్యమ భవిష్యత్‌ను అందించేలా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు వివరించారు.సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ... రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను సభ ముందుంచారు. తెలంగాణలో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసి రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. హైదరాబాద్‌లో మహిళల భద్రతకు రూ.10 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.221 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

దేశ చరిత్రలో రూ.17వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ప్రకటించారు. రుణమాపీ కోసం ఇప్పటికే 4250 కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వం మిగిలిని నిధులను వచ్చే మూడేళ్లలో దశలవారీగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  రైతులకు పెట్టుబడి రాయితీకి బడ్జెట్‌లో రూ.480కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఉద్యానవన శాఖకు 250 కోట్ల రూపాయలను, వ్యవసాయ రంగంలో యంత్రీకరణకు 100 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు.

459 మంది అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో 24గంటల విద్యుత్ సరఫరా చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించనట్లు చెప్పారు. పది నెలలకు సంబంధించిన బడ్జెట్లో అన్ని వర్గాల అబివృద్దిని, సంక్షేమాన్ని కాంక్షించినట్లు ఈటెల చెప్పుకోచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana assembly  telangana budget  budget high lights  eetela rajender  Telangana Cm  KCR  

Other Articles