Buma Nagireddi | Kurnool | Atrocity case | Police | Bail | MLC Elections

Court fire on police for putting atrocity case on buma nagireddy

Buma Nagireddi, Kurnool, Atrocity case, Police, Bail, MLC Elections

Court fire on police for putting atrocity case on Buma Nagireddy. Court condemn the police behaviour. Court gave bail to Buma Nagireddy on atrocity case.

పోలీసులూ.. డోంట్ టచ్ మి అంటే అట్రాసిటి కేసా..?

Posted: 07/08/2015 01:59 PM IST
Court fire on police for putting atrocity case on buma nagireddy

అట్రాసిటి కేసు గురించి దేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. కులం పేరుతో ఎవరినీ దూషించడం లేదా అవమానించేలా చెయ్యడం చేయకూడదు అంటూ కేంద్ర ప్రభుత్వం అట్రాసిటి చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే కొంత మంది దాన్ని తప్పుగా వాడుతున్నారు ఈ విషయం చాలా మంది గమనించి ఉంటారు కూడా. అయితే అట్రాసిటి పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఘటనల గురించి కూడా విన్నాం. అయితే తాజాగా భూమా నాగిరెడ్డి వ్యవహారంలో పోలీసులు అతిగా ప్రవర్తించారని కొర్టు అభిప్రాయపడిండి. అయినా భూమా నాగిరెడ్డి వాడిన పదాలకు, అట్రాసిటి కేసు ఎలా పెడతారు అని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. అట్రాసిటి కేు కింద అరెస్టు చేసిన భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

Also Read:భూమా నాగిరెడ్డి  పోలీస్ స్టేషన్ టు కోర్ట్

భూమా నాగిరెడ్డి పోలీస్ స్టేషన్ టు కోర్ట్ వయా ఆస్పత్రి - See more at: http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/65872-bhooma-nagireddy-reddy-moves-to-court-via-the-police-station-to-the-hospital.html#sthash.7vgaHkPn.dpuf

డోంట్ టచ్ మీ అంటే అట్రాసిటి కేసు పెడతారు. ఏంటీ అట్రాసిటి కేసు అంత మాత్రానికే పెట్టేస్తారా..? అని అనుకోకండి. ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు పోలీసులే తలుచుకుంటే అట్రాసిటి కేసేంటి ఏ కేసైనా పెట్టొచ్చు. భూమా నాగిరెడ్డి విషయంలోనూ అదే జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో  భూమా అఖిల ప్రియ పోలింగ్ బూత్ దగ్గర నిల్చున్నప్పుడు పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోండి అని అన్నారు. అయితే దీనిపై మండిపడుతూ భూమా నాగిరెడ్డి ప్రజాప్రతినిధిగా ఉన్న తన కూతురు మీద ఎవరు మాట్లాడారు అంటూ ఊగిపోయారు. అయితే అక్కడే ఉన్న డిఎస్పీ దేవదానం భూమా దగ్గరికి వస్తుండగా డోన్ట్ టచ్ అని అన్పారు. ఆ డిఎస్పీ దళితుడు కావడంతో ఏకంగా అట్రాసిటి కేసు ఫైల్ చేశారు. అయితే కోర్టు ఈ విషయంపై పోలీసులను మందలించింది. డోన్ట్ టచ్ మి అంటే అట్రాసిటి కేసు పెట్టేస్తారా..? అని ప్రశ్నించింది.

By Abhinavachary

Also Read: పోలీసుల మీద మండిపడ్డ భూమా నాగిరెడ్డి

పోలీసుల మీద మండిపడ్డ భూమా నాగిరెడ్డి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Buma Nagireddi  Kurnool  Atrocity case  Police  Bail  MLC Elections  

Other Articles