Bhooma nagireddy | Kurnool | Police | Bhooma Akhila priya, Elections

Bhooma nagireddy reddy moves to court via the police station to the hospital

Bhooma nagireddy, Kurnool, Police, Bhooma Akhila priya, Elections

Bhooma Nagireddy Reddy moves to court via the police station to the hospital MLC elections in Kurnool and Prakasam districts witnessed arrests and huge turnout of voters despite the YSRC call to boycott the polls on Friday. There were allegations and counter-allegations on kidnaps in Nandyal

భూమా నాగిరెడ్డి పోలీస్ స్టేషన్ టు కోర్ట్ వయా ఆస్పత్రి

Posted: 07/04/2015 08:46 AM IST
Bhooma nagireddy reddy moves to court via the police station to the hospital

వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని కర్నూలు జిల్లా నంద్యాల మూడో పట్టణ పోలీసు స్టేషన్‌ నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం భూమాను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. తెదేపా ప్రభుత్వం వైకాపా ఎమ్మెల్యేలపై కావాలనే కేసులు పెడుతోందని భూమా ఆరోపించారు. రాజకీయ లబ్ధికోసమే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇలాంటి కేసులకు భయపడేది లేదని అన్నారు. అయితే భూమా నాగిరెడ్డి నోటి దురుసు కారణంగానే అరెస్టయ్యారని.. ఎలాంటి కక్షసాధింపులు లేవని కొందరు విమర్శిస్తున్నారు.

Also Read: పోలీసుల మీద మండిపడ్డ భూమా నాగిరెడ్డి


 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన నాగిరెడ్డి తనయ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను పోలీసులు వెళ్ళిపోవాలని కోరారు. ఆ సందర్భంగా అఖిలప్రియకు, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న నాగిరెడ్డి అక్కడికి చేరుకుని.. తన కుమార్తెను వెళ్లమని చెప్పడానికి మీరెవరని పోలీసులపై విరుచుకుపడ్డారు. అఖిలప్రియను వెళ్లమనలేదని.. ఎమ్మెల్యే షెడ్ కిందకు వెళ్లమని చెప్పామని పోలీసులు ఎంత నచ్చజెప్పినా భూమా నాగిరెడ్డి దురుసుగా ప్రవర్తించారని, పరుష పదజాలం ప్రయోగించారంటూ కేసు నమోదైంది. ఇంకా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తమ విధులకు అడ్డుతగిలారంటూ డీఎస్పీ దేవదానం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను టచ్ చేయవద్దంటూ భూమా పొగరుగా వ్యవహరించారని పేర్కొన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhooma nagireddy  Kurnool  Police  Bhooma Akhila priya  Elections  

Other Articles