Pawan Kalyan new victim of TDP's 'use and throw' policy.

Pawan kalyan victim of chandrababu s use and throw policy ysrcp

Pawan Kalyan new victim of TDP's 'use and throw' policy, Pawan Kalyan victim of Chandrababu's use and throw policy critisizes ysrcp, Chandrababu Use And Throw Policy, Pawan Kalyan Victim, Chandrababu, YSRCP Spokesperson Ambati Rambabu, ambati rambabau, janasena activists state wide protest over TDP MPs comments, pavan kalyan on cash for vote case, section 8, special status, TDP mps, hyderabad, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

Stating that Actor and Jana Sena Chief Pawan Kalyan was being used by TDP Chief and AP Chief Minister Chandrababu Naidu, YSRCP Spokesperson Ambati Rambabu said that Pawan Kalyan was being targetted and criticized by the TDP MP's on the behest of the AP Chief Minister.

టీడీపీ ‘వాడుకుని వదిలేసి విధానా’ బాధితుడు పవన్ కల్యాన్

Posted: 07/08/2015 02:09 PM IST
Pawan kalyan victim of chandrababu s use and throw policy ysrcp

తెలుగు దేశం పార్టీ వాడుకుని వదిలేసే విధానం ఇప్పుడు జనసేన అధినేత, సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాన్ కు అర్థమైందని వైఎస్సార్ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. , టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు నైజం, రంగురెండు ఇప్పుడు బయటపడ్డాయని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. అవసరం వచ్చినప్పడల్లా తనకు కావాల్సిన వారిని దువ్వుకుని పనులు చేయించుకునే బాబు.. అవసరం తీరగానే వారిని వదిలేయడం అయనకు పరిపాటిగా మారిందన్నారు.

పవన్ కళ్యాణ్ ను కూడా చంద్రబాబు వాడుకుని వదలివేసినట్లేనని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పై టిడిపి ఎంపీలు కేశినేని నాని తదితరులు విమర్శలు చేయడాన్ని ప్రస్తావిస్తూ , ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతోందని చెప్పుకోచ్చారు. చంద్రబాబుకు చెప్పకుండా టిడిపి ఎంపీలు అలా విమర్శలు చేయరని ఆయన అన్నారు. ఒకవైపు కొందరిని పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి పురమాయించి, మరోవైపు పవన్ కళ్యాణ్ కు మద్దతు తోనే తాము అధికారంలోకి వచ్చామని రెండు నాలుకల సిద్దాంతాన్ని చంద్రబాబు వాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ద్వంద నీతిని ఇప్పటికైనా పవన్ కల్యాన్ గుర్తించాలన్నారు. చంద్రబాబుకు ఎవరినైనా వాడుకుని వదలివేయడం అలవాటేనని, గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ కు కూడా ఎదురైందని అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించవలసిన బాద్యత ఏర్పడిందని ఆయన అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan  ambati rambabu  use and throw policy  janasena  Ysrcp  

Other Articles