English teachers in Punjab flunk English test

English teachers in punjab flunk english test

english teachers in Punjab flunk English test, tenses, spellings, every thing was wrong, rap on their knuckles, Education Minister Dalit Singh Cheema, unlearn the wrong, howlers in spellings, practical spelt “precticls”, should as “shoud”, lack as “leak”, vacant as “vacent” 220 government schools teachers, Punjab School Education Board, Mohali town,

There were howlers in spellings: practical was spelt as “precticls”, should as “shoud”, lack as “leak” and vacant as “vacent”.

ఆంగ్ల పరీక్షలో బోల్లా కోట్టిన ఆంగ్ల ఉపాధ్యాయులు

Posted: 06/28/2015 08:22 PM IST
English teachers in punjab flunk english test

ఆ మధ్య ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగు చూసిన ఉపాధ్యాయుల భాగోతం తాజాగా పంజాబ్ లోనూ రిపీట్ అయ్యింది. వారు విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్యాంశాలపైనే వారికి అవగాహన లేకపోవడం..బావితరాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లో గణితం భోధించే మాస్టార్లకు కనీసం ఎక్కాలు తెలియకపోవడం, చిన్న పాటీ కూడికలను కూడా వారు తప్పుగా చేయడం పలువుర్ని విస్మయానికి గురి చేసింది. కాగా, తాజాగా పంజాబ్ లో ఆంగ్ల పాఠ్యాంశాలను భోధిస్తున్న ఉపాధ్యయులకు కూడా వారు బోధించే పాఠ్యాంశాలపై అవాగాహనా లేకపోవడం, అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలతో రాయడంతో.. పంజాబ్ విద్యా శాఖ అధికారులే ఖంగు తిన్నారట.

తాజాగా కొంత మంది ఇంగ్లీష్ టీచర్లకు అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించగా పంజాబ్ విద్యాశాఖ అధికారులు విస్తుపోయారు. సుమారుగా 220 మంది ఆంగ్ల బాష టీచర్లకు ఈ పరీక్షలు నిర్వహించారు అధికారులు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలు మొదలు కోని దాదాపు అన్ని పదాలు తప్పుగా రాసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చలిత్ సింగ్ చీమా తెలిపారు. టీచర్లు చేసిన తప్పిదాలను వారు పాఠశఆలలకు తిరిగి వెళ్లిన తరువాత తెలుసుకుంటారని తాము ఆశిస్తున్నట్లు ఆయన పేర్కోన్నారు.

అసలు ఈ విషయం ఎలా వెలుగుచూసిందంటే.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో అత్యధిక శాతం మంది ఇంగ్లీష్ బాషలో తప్పడంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మూడు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో ఎనభై వేల మందికి పైగా పరీక్షల్లో తప్పారు. ఒక సబెక్టులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్ కావడంతో.. తప్పు ఎక్కడ జరిగిందన్న విషయంలో విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మొహలీ పట్టణంలో టీచర్లతో విద్యాశాఖ సమావేశం నిర్వహించింది. అక్కడ వారికి పరీక్షలు నిర్వహించగా.. అసలు లోసుగులు భయటకు వచ్చాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : english teachers  Punjab  English test  

Other Articles