L.K. Advani: I Quit Over Hawala Because I Listened To My Conscience

Lalit modi row advani s veiled message to modi government

lk advai, lalit modi, hawala scam, advani quit over hwala sca, sushma swaraj, vasundara raje, maintain probity in public life, cbi, political probity, modigate, lk advani, hawala case, my conscience, pc chakco, nitish kumar, rahul gandhi, congress

L.K. Advani emphasised the need for political probity by citing his own resignation in 1996 after his name cropped up in the Hawala scam.

మరోమారు మోడీ ప్రభుత్వంపై తూటాలు పేల్చిన అగ్రనేత..

Posted: 06/28/2015 09:04 PM IST
Lalit modi row advani s veiled message to modi government

బీజేపీ అగ్రనేత, కురువృద్దుడు లాల్ కిషన్కె అద్వాని కేంద్రంలో కొలువుదీరిన సొంత పార్టీకి చెందిన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తునే వున్నారు. అగ్రనేతగా వున్న ఆయన ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనుకుంటున్నారో, లేక విపక్షాలకు బలాన్ని అందించాలని అనుకుంటున్నారో..? కానీ మరోమారు ఆయన నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వ్యవహరాశైలిపై విమర్శలు గుప్పించారు. దేశంలో మరోసారి ఎమర్జన్సీ పాలనను తోసిపుచ్చలేమంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు లలిత్‌ మోదీ వ్యవహారాన్ని ప్రస్తావించారు.

ప్రజా జీవితంలో ఉన్నవారికి మంచి ప్రవర్తనా, నీతి, నిజాయితే ప్రాణమని అన్నారు. దానిని ఆయా నేతలు పాటించి తీరాలని అద్వాని నొక్కి చెప్పారు. 1996లో హవాలా కుంభకోణంలో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు తక్షణమే రాజీనామా చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కుంభకోణంలో తనకు క్లీన్‌ చిట్‌ లభించిన తర్వాతే 1998లో తిరిగి ఎన్నిక అయ్యానని ఆయన చెప్పారు. లలిత్ మోడీ సహకరించారన్న అభియోగాల నేపథ్యంలో పదవులు అంటిపెట్టుకుని ఉన్న సుష్మా, వసుంధర రాజేలపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modigate  lk advani  hawala case  my conscience  

Other Articles