hyderabad old city witnesses domestic violence and dowry harrasment

Husband harrasses wife since 18 months

husband harrasses wife since 18 months, domestic violence, dowry harrasment, hyderabad, wife, husband, attack, murder, suicide note, violence against women, crime against women, harassment against women

A man allegedly attacked on his wife and her family in Hyderabad.

సూనైడ్ రాయించుకుని భార్యపై హత్యకు కుట్ర..

Posted: 06/28/2015 06:47 PM IST
Husband harrasses wife since 18 months

హైదరాబాద్ నగరంలోని చాంద్రాయనగుట్టలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను సుమారు 18 నెలలుగా ఇంట్లో నిర్బంధించిన ఓ దుర్మార్గుడు.. ఆమెతో సూసైడ్‌ నోట్‌ రాయించుకుని హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. విషయం తెలుసుకుని వచ్చిన భార్య బంధువులపై కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. బండ్లగూడలో ఉంటున్న మహ్మద్ గౌస్ అనే వ్యక్తికి సయ్యద్ ఫాతిమాతో వివాహమైంది. పెళ్ళయినప్పటి నుంచీ అదనపు కట్నం కోసం ఫాతిమాను వేధిస్తున్న గౌస్, ఆమెను ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.

చివరికి స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఫాతిమా తరపు బందువులు వచ్చి ఎందుకిలా చేశావ్ అని నిలదీయడంతో వారిపై కూడా కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డాడు. అలజడి రేగడంతో రక్తగాయాలైన ఫాతిమా బందువులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎట్టకేలకు భర్త నరకకూపం నుంచి స్థానికుల సాయంతో బయటపడిన ఫాతిమా ఒక స్వచ్ఛంద సంస్థ చొరవతో చాంద్రాయణగుట్ట పీఎస్‌లో పిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి భర్త పెడుతున్న హింస, వేధింపులపై ఫిర్యాదు చేయగా,  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad  wife  husband  attack  murder  suicide note  

Other Articles