Telangana Minister KTR take away micromax factory to his state from andhra pradesh | Micromax Company

Ktr take away micromax factory to telangana from andhra pradesh

ktr, ktr latest news, ktr updates, ktr controversies, ktr micromax, micromax factory, andhra pradesh, jsv prasad, ap it ministers, chandrababu naidu news, kcr news, telangana state, micromax factories, micromax factory in telangana

KTR take away micromax factory to telangana from andhra pradesh : Telangana Minister KTR take away micromax factory to his state from andhra pradesh with his Ingenuity.

ఏపీకి దక్కాల్సింది.. కేటీఆర్ ఎత్తుకుపోయారు!

Posted: 06/24/2015 10:03 AM IST
Ktr take away micromax factory to telangana from andhra pradesh

రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పనులపై దృష్టి సారించిన విషయం తెలిసిందే! ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను తమ రాష్ట్రాలవైపు ఆకర్షించేందుకు రెండు రాష్ట్రాలు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే పారిశ్రామికవేత్తలతో ఆయా రాష్ట్రాలు సంప్రదింపులు జరుపుకుంటున్నాయి. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఈ రెండు రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించే పనిలో భాగంగా ఎవరెవరితో సంప్రదింపులు జరుపుకుంటున్నాయన్న విషయంలో ఒకదానిపై మరొకటి నిఘా వేసుకున్న పరిస్థితి నెలకొంది. అంటే.. ఒక రాష్ట్రం ఏ కంపెనీతో సంప్రదింపులు జరుపుతుందో అదే కంపెనీతో మరో రాష్ట్రం మంతనాలు జరిపి తమవైపుకు తన్నుకుపోతున్నారు. ఇందుకు నిదర్శనంగా రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి.

గతంలో హీరో మోటార్ కార్ప్ పరిశ్రమను రాబట్టుకునే విషయంలో రెండు రాష్ట్రాలు బాగానే పోటీపడ్డాయి. తొలుత దీనిని తమవైపుకు ఆకర్షించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బాగానే కసరత్తులు చేశారు. అయితే.. అదే పరిశ్రమతో ఏపీ కూడా మంతనాలు జరిపింది. ఇందులో భాగంగానే ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా వున్న జేఎస్వీ ప్రసాద్.. తన తెలివితో ఆ పరిశ్రమను ఏపీకి తరలించుకుపోయారు. దీంతో తెలంగాణ సర్కార్ ఏపీ మీద కాస్త ఇబ్బందిపడింది. తమకు దక్కాల్సిన పరిశ్రమను ఏపీ తీసుకుపోయిందని తెలంగాణ జీర్ణించుకోలేకపోయింది. తమకూ సమయం వస్తుందని కదా వేచి చూడగా.. చివరికి ఆ టైమ్ వచ్చేసింది. తెలంగాణ కూడా ఏపీకి దక్కాల్సిన ఓ అంతర్జాతీయ సంస్థను సునాయాసంగా ఎగురేసుకుపోయింది. ఈ విషయంలో కేటీఆర్ బాగానే కష్టపడ్డారని తెలుస్తోంది.

ఇటీవల మైక్రోమ్యాక్స్ తో ఏపీ సర్కార్ చర్చలు జరిపింది. ఆ సంస్థ కర్మాగారాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయించే దిశగా దాదాపుగా ఒప్పందం కుదుర్చుకుందట! అయితే.. ఈ విషయాన్ని ఎలాగోలా తెలుసుకున్న తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్.. రంగంలోకి దిగిపోయారు. మైక్రోమ్యాక్స్ సంస్థ యాజమాన్యంతో కేటీఆర్ చర్చలు జరిపి.. ఏపీలో పెట్టాలనుకుంటున్న కర్మాగారాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేలా ఒప్పించారని సమాచారం! ఈ విషయం తెలుసుకున్న ఏపీ సర్కార్.. ఇకపై పారిశ్రామికవేత్తలతో జరిపే చర్చలను రహస్యంగా వుంచాలని నిర్ణయించిందని తెలిసింది. ఇలా పరిశ్రమలను ‘ఎగిరేసుకుపోయే’ రగడ ఎన్నాళ్లవరకు కొనసాగుతుందో!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ktr  micromax  telangana  ap  

Other Articles