Drunk and Drive | Fine | Ten thousand fine

Central road transport ministry passed a new go to fine upto ten thousand fine on drunk and drive cases

Drunk and Drive, Fine, Ten thousand fine

Central Road transport Ministry passed a new GO to fine upto ten thousand fine on drunk and drive cases. The govt very serious on the drunk and drive cases.

తాగి వాహనం నడిపితే పదివేలు ఫైన్

Posted: 06/24/2015 10:15 AM IST
Central road transport ministry passed a new go to fine upto ten thousand fine on drunk and drive cases


తాగి డ్రైవ్ చెయ్యకండి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అని ఎంత చెబుతున్నా చాలా మంది వినడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా తాగుబోతుల భరతం పడుతున్నా బుద్దిరావడం లేదు. ఇక మెత్తగా చెబితే వినడం లేదు కదా అని ప్రభుత్వం తాగి డ్రైవ్ చేసే వారికి తగిన గుణపాఠం నేర్పుతోంది. డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఇకపై రూల్స్ కఠినతరంగా ఉండబోతున్నాయి. ఇలాంటివారిని ఆషామాషీగా వదలరాదని ప్రభుత్వం భావిస్తోంది. మద్యం తాగి వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడివారికి జరిమానా అయిదు రెట్లు ఎక్కువగా విధించాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. రెండో సారీ అదే తప్పు చేస్తే 10 వేల రూపాయల జరిమానా, ఆరు నెలలనుంచి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. పైగా సవత్సరం పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు.

drunk-and-drive02

ఈ మంత్రిత్వ శాఖ విధించబోతున్న నిబంధనల్లో ఇవి కొన్ని మాత్రమే. ఈ రూల్స్‌కు సంబంధించిన బిల్లు చట్టంగా మారితే ఇవన్నీ అమలులోకి వస్తాయి. తన తాజా బిల్లు కాపీలను ఈ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ పంపింది. ప్రస్తుతం మొదటిసారి పట్టుబడినవారికి రెండువేల రూపాయలవరకూ జరిమానా విధిస్తున్నారు. ఇక ఇన్సూర్ చేయని వాహనానికి దాని టైప్‌ను బట్టి రెండువేలనుంచి లక్ష వరకు, వెహికల్ డిజైన్‌లో లోపాలుంటే అయిదు లక్షలవరకు ఫైన్ విధించే అవకాశం ఉంది.

drunk-and-drive01

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drunk and Drive  Fine  Ten thousand fine  

Other Articles