Section 8 | Telangana | ap | Governor | The Central govt

Central govt moving file to implement the section 8 in hyderabad

Section 8, Telangana, ap, Governor, The Central govt

Central govt moving file to implement the section 8 in hyderabad. Telangan govt opposing the central govt step. But ap govt putting pressure on the central govt to implement section 8 in hyderabad.

ఇక సెక్షన్ పై మద్దతుకు రెండు రాష్ట్రాలు సిద్దం

Posted: 06/24/2015 09:14 AM IST
Central govt moving file to implement the section 8 in hyderabad

రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌ పర్యవేక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. విభజన చట్టంలోని సెక్షన్‌-8ని పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు పోరాడాలని సంకల్పించారు. భారత అటార్నీ జనరల్‌ సెక్షన్‌-8పై వెలిబుచ్చిన అభిప్రా యాలను స్వాగతించిన ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసే దాకా అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఓటుకు నోటు వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఓటుకు నోటు నుండి ట్యాపింగ్ కు ట్యాపింగ్ నుండి సెక్షన్8 కు పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

సెక్షన్‌-8పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌తో సమావేశ మైన విషయం తెలుసుకున్న చంద్రబాబు అదే సమ యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో ప్రత్యేకంగా భేటీ నిర్వహించారు. సెక్షన్‌-8ని రాద్దాంతం చేసేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నారని, ఈ ప్రతిపాదనను ధీటుగా ఎదుర్కోవాలని దిశా నిర్దేశం చేశారు. అవసరమైతే మరోసారి ఢిల్లి వెళ్లి ఇదే అంశంపై ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశం కావాలని నిర్ణయించారు. ఏడాది కాలంగా గుర్తుకు రాని సెక్షన్‌-8ని ఓటుకు నోటు వ్యవహారం బయటపడ్డాకే ఢిల్లిd వెళ్లి ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని నిర్ణయించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Section 8  Telangana  ap  Governor  The Central govt  

Other Articles