Governor | Chandrababu | KCR | cash for vote | Telangana | Revanth Reddy

Governor called telugu states cms on cash for vote scandal

Governor, Chandrababu, KCR, cash for vote, Telangana, Revanth Reddy

Governor Called telugu states Cms on cash for vote scandal. The central govt order to convence the Chandrababu naidu and KCR on on going cash for vote scandal issue.

గవర్నర్.. ఈ మంటలు ఆర్పుతారా..?

Posted: 06/13/2015 10:46 AM IST
Governor called telugu states cms on cash for vote scandal

ఓటుకు నోటు వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య నిప్పురాజేసింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాటల తూటాలతో యుద్దం చేస్తున్నారు. ఇక తెలంగాణ ఏసీబీ అధికారులు విచారణను వేగవంతం చేస్తే, ఏపి నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దాంతో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ కు కేంద్రం నుండి పిలుపువచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ఘర్షణ వాతావరణాన్ని సద్దుమణిగేలా చెయ్యాలని గవర్నర్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇద్దరు సిఎంలు తనను కలవాలని గవర్నర్‌ వేర్వేరుగా ఆహ్వానించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వేర్వేరుగా మాట్లాడిన తర్వాత గవర్నర్‌ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించగా, గవర్నర్‌ను సిఎం కెసిఆర్‌ కలిసే అంశం తమకు తెలియదని వివరణ ఇచ్చారు. అప్పటికప్పుడు జరిగే కార్యక్రమాలను తాము చెప్పలేమని అన్నారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా, ఇటీవల నోటుకు ఓటు వ్యవహారమైనా, ఆడియో టేపులైనా ప్రతి అంశం తన దృష్టికి వచ్చిన వెంటనే సిఎం కెసిఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి వివరిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ప్రారంభించిన పారిశ్రామిక విధానాన్ని గవర్నర్‌కు కెసిఆర్‌ వివరిస్తారని తెలుస్తోంది. శనివారం ఏదో ఒక సందర్భంలో రాజ్‌భవన్‌కు కెసిఆర్‌ వెళ్లతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ సమయంలోనే ఈ అంశాలు బయటకు వస్తాయని అంటున్నారు.

కెసిఆర్‌ కంటే ముందుగానే ఏపీ సిఎం చంద్రబాబు గవర్నర్ ను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాతే కెసిఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈరోజు గవర్నర్ ను కలిసే వీలు కుదరకపోయినా ఈ వారంలో ఏదో ఒక రోజు ఇద్దరు సిఎంలతో గవర్నర్‌ భేటీ కావడం ఖాయమని, అయినా గవర్నర్‌తో ముఖ్యమంత్రుల భేటీ కొత్తేమీ కాదని, ఎప్పుడైన కలిసే అవకాశం లేకపోలేదని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు పేర్కొన్నాయి. రెండు రాష్ట్రాల ఏడాది పాలన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారం, ఫోన్ల ట్యాపింగ్‌, ఆ తర్వాత జరిగిన మాటల యుద్ధం, సెక్షన్‌ 8 తదితర అంశాలపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రహౌంశాఖ, ఆర్థిక, రక్షణశాఖలకు నివేదిక ఇచ్చేందుకు గవర్నర్‌ నరసింహన్‌ ఈ నెల తొమ్మిదిన ఢిల్లీకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడు రోజుల పర్యటనలో ఆయన ప్రతిఒక్కర్ని కలిసి రాష్ట్ర నివేదికలు సమర్పించారు. గతంలో నీటి పంపకాలు, ఎంసెట్‌ తదితర విషయాల్లో గొడవల వచ్చినప్పుడు గవర్నర్‌ పిలిచి వారి మధ్య సయోధ్య కుదిర్చారు. మాటలు కలిపారు. ఇప్పుడు కూడా వారి మధ్య గొడవను చల్లార్చే బాధ్యతను కేంద్రప్రభుత్వం గవర్నర్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  Chandrababu  KCR  cash for vote  Telangana  Revanth Reddy  

Other Articles