Inauguration | Amaravati | Narendra modi | Japan | Singapore

Three nation prime ministers may come to inaugurate ap capital amaravati

Pm, Inauguration, Amaravati, Narendra modi, Japan, Singapore

Three nation prime ministers may come to inaugurate ap capital Amaravati. Pm Narendra modi and Japan, Singapor Pms may attend the programmee.

అమరావతి శంకుస్థాపనకు ముగ్గురు ప్రధానులు...!

Posted: 06/13/2015 08:44 AM IST
Three nation prime ministers may come to inaugurate ap capital amaravati

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి భూమి పూజను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో భూమిపూజను  గ్రాండ్ గా చేసి తన బలాన్ని చాటే ప్రయత్నంలో ఉన్నారు బాబు. ఈ మేరకు ప్రధాని మోడీ పర్మీషన్ కూడా తీసుకున్నారు. మన ప్రధాని మోడీ భూమి పూజకు హాజరు కానున్నట్లు ముందే చెప్పిన బాబు ఇపుడు సింగపూర్, జపాన్ ప్రధానులను సైతం ఆహ్వానించనున్నారు. మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారిని రప్పించే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు. అయితే ఎపుడు ఎలా ఆహ్వానించాలనేదానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.  అమరావతి భూమి పూజకు మూడు దేశాల అధినేతలు వస్తే కనుక చంద్రబాబుకు కొంచెం రిలీఫ్ దొరికినట్లవుతుంది.

రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావడానికి సింగపూర్‌, జపాన్‌ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని, ఆ రెండు దేశాల అధినేతలను కూడా పిలవాలని అనుకొంటున్నామని చంద్రబాబు చెప్పినప్పుడు... ఆ ఆలోచన బాగుందని, పిలవండని మోదీ కూడా అన్నారు. ‘రాజధాని నిర్మాణంలో మీ వ్యూహం, ప్రయత్నం బాగున్నాయి. అమరావతి ఒక మంచి రాజధాని నగరం అవుతుందన్న నమ్మకం నాకు కలుగుతోంది. మీ కృషికి మా మద్దతు ఉంటుంది’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సింగపూర్‌, జపాన్‌ ప్రధానులకు త్వరలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఆహ్వానం పంపబోతున్నామని, తగినంత ముందుగానే వారికి సమాచారం ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు గనక ఫలిస్తే అంతర్జాతీయ మీడియలో అమరావతి పాపులర్ కావడంతో పాటు, ఓటుకు నోటు వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడుకు చాలా ప్లస్ అవుతుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pm  Inauguration  Amaravati  Narendra modi  Japan  Singapore  

Other Articles