Telangana | chandrababu | ACB | Notices | cash for vote scam

Telangana acb officers may issue the notices to chandrababu as witness in the cash for vote scam

Telangana, chandrababu, ACB, Notices, cash for vote scam

Telangana ACB officers may issue the notices to chandrababu as vitness in the cash for vote scam. Telangana acb officers took leagal advice from senior advocates.

చంద్రబాబు నిందుతుడు కాదు సాక్షి.. ఏసీబీ!

Posted: 06/13/2015 11:25 AM IST
Telangana acb officers may issue the notices to chandrababu as witness in the cash for vote scam

అవును, తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పురాజేసిన ఓటుకు నోటు వ్యవహారం సీరియల్స్ లో లాగా ట్విస్ట్ ల మీద ట్విస్టులకు గురవుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ ను లోబరుచుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డీల్ చేస్తున్న క్రమంలో తెలంగాణ ఏసీబీ అధికారులు రేవంత్ ను అరెస్టు చేశారు. అయితే తరువాత చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా భావిస్తున్న ఆడియో టేపులు బయటికి విడుదలయ్యాయి. అయితే చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు వ్యవహారంలో జోక్యం చేసుకున్న నేపథ్యంలో చంద్రబాబును అరెస్టు చెయ్యాలని తెలంగాణ నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ ఏసీబీ అధికారులు మాత్రం ప్లాన్ మార్చారు. ప్లాన్ ఎ కాకుండా ప్లాన్ బిని అమలు చేస్తున్నారట. అవును అసలు ఈ ప్లాన్ ఎ, ప్లాన్ బిలు ఏంటో అనుకుంటున్నారా..? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

ప్లాన్ ఎ- తెలంగాణ ఏసీబీ అధికారులు ఆడియోలో ఉన్న చంద్రబాబు నాయుడు వాయిస్ ఆధారంగా ముందుగా అరెస్టు చేసి విచారించాలని నిర్ణయం తీసుకున్నారట.
కానీ తర్వాత మాత్రం చంద్రబాబు నాయుడు కోర్టు నుండి స్టే తెచ్చుకునే అవకాశం ఉండటంతో ఇది సరికాదని డ్రాప్ అయ్యారట.
ప్లాన్ బి- ఈ ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడును నిందితుడిగా కాకుండా సాక్షిగా తెలిసిన వివరాలను చెప్పాలని నోటీసులు పంపనుట్లు సమాచారం.

మొత్తానికి తెలంగాణ ఏసీబీ అధికారులు ఓటుకు నోటు వ్యవహారంలో చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం. మరి దీన్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  chandrababu  ACB  Notices  cash for vote scam  

Other Articles