DGP | Telangana | A.k.Khan | KCR

Telangana govt moving files to appoint a k khan as new dgp

DGP, Telangana, A.k.Khan, KCR

Telangana Govt moving files to appoint A.K.Khan as new DGP. Telangana cm kcr propose to appoint A.K.Khan as new DGP.

తెలంగాణ డిజిపిగా ఏకే ఖాన్..?

Posted: 06/12/2015 08:47 AM IST
Telangana govt moving files to appoint a k khan as new dgp

ఏకే ఖాన్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన పేరు. ఓటుకు నోటు వ్యవహారంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న ఏసీబీకి ప్రస్తుతం డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ సర్కార్ కు లాభం చేకూరేలా.. ఏపి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ నేతలకు తలనొప్పి గా మారింది. అయితే తాజాగా ఏసీబీ డిజిగా పనిచేస్తున్న ఏకే ఖాన్ ను తెలంగాణ డిజిపిగా నియమించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచెసేందకు అన్ని ఏర్పాట్లు చేప్తున్నారు. తెలంగాణ సర్కార్ ఆ దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తాత్కాలిక డిజిపిగా అనురాగ్ శర్మను నియమించింది. అయితే పూర్తి స్థాయి డిజిపిగా ఏకే ఖాన్ ను నియమించేందుకు ప్రపోజల్ సిద్దం చేస్తోంది. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య సాగుతున్న ఓటుకు నోటు వ్యవహారం పీక్స్ లో ఉండగా కేసీఆర్ కావాలనే ఏకే ఖాన్ ను డిజిపిగా నియమించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ సర్కార్‌ ఏర్పడి ఏడాది గడిచిపో యినా అనురాగ్‌ శర్మను ఇంకెంత కాలం తాత్కాలిక డిజిపిగా కొనసాగిస్తారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, యూపీఎస్సీ సర్కార్‌కు మొట్టికాయ వేసింది. ఒకవేళ అనురాగ్‌ శర్మను శాశ్వతంగా కొనసాగించాలనుకుంటే అధికారికంగా పేరును ఖరారు చేసి ఫైలు పంపించండి, లేదంటే కొత్త డిజిపి కోసం సీనియర్‌ ఐపిఎస్‌ల పేర్లు పంపించండని యూపీఎస్సీ లేఖ పంపించింది. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మూడు నాలుగు నెలల క్రితం ఆరుగురు సీని యర్‌ ఐపిఎస్‌ల పేర్లను జోడించి లిస్టును ప్రిపేర్‌ చేసి యూపీ ఎస్సీకి పంపించింది.. అయితే రెండు రోజుల క్రితం ఫైల్‌ను తిరిగి పంపిస్తూ ఐపి ఎస్‌ల పేర్లలో ఏకే.ఖాన్‌, అరుణా బహుగుణ పేర్లు సరిగా లేవు కాబట్టి వివరాలు సేకరించి పూర్తి పేర్లను నమోదు చేసి పంపించాలని సర్కార్‌కు తిరిగి పంపించినట్లు తెలిసింది. అరుణా బహుగుణ డిజిపి రేసులోంచి తప్పుకుం టున్న నేపథ్యంలో ఏకే.ఖాన్‌కు డిజిపి పదోన్నతి లభించనున్నట్లు తెలిసింది. ఏసిబి డిజిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన ఏకే.ఖాన్‌ను తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆయన్ను ఏసిబి డిజిగా నియమించారు. ఇటీవల ఓటుకు నోటు వ్యవ హారం లో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రెడ్‌హాం డెడ్‌గా పట్టుకున్న ఏకే.ఖాన్‌ రాష్ట్రంలో అవినీతి డిపార్టు మెంట్లు, అధికారుల పేర్లను సేకరించి వారిపై నిఘా పెట్టడమే కాకుండా ఏసిబి డిజిగా సమర్ధ వంతంగా పనిచేస్తున్నందున ఆయన్నే డిజిపిగా నియమించుకునే విధంగా కేసిఆర్‌ కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DGP  Telangana  A.k.Khan  KCR  

Other Articles