KCR | Chandrababu | Telangana | Ap | Cinema

Political parties showing cinemas in telugu states

KCR, Chandrababu, Telangana, Ap, Cinema

Political parties showing cinemas in telugu states. The Telangana Cm KCR said that Chandrababu naidu cinema wil go. Somireddy Chandrashekar Reddy condemn that words and he said the real cinema starts now.

టిడిపి సినిమా ఇది.. టిఆర్ఎస్ సినిమా అది

Posted: 06/12/2015 09:13 AM IST
Political parties showing cinemas in telugu states

తాజాగా తెలంగాణ, ఏపిల మధ్య సాగుతున్న ఓటుకు నోటు వ్యవహారం తారా స్థాయికి చేరింది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా, కీలకనేతల ఫోన్టలను ట్యాపింగ్ చేసిందని ఏపి ముఖ్యమంత్రి, అధికారులు మండిపడుతున్నారు. కానీ తెలంగాణ అధికారులు, మంత్రులు, కేసీఆర్ కూడా అలాంటిదేమీ లేదని అంటున్నారు. ఎవరి ఫోన్లను ట్యాప్ చెయ్యాల్సిన ఖర్మ తమకు పట్టలేదని అంటున్నారు. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబు నాయుడు సినిమా ఇంకా అయిపోలేదని.. ఇంకా ఉంది అని వ్యాఖ్యానించారు. సినిమాల్లో ఎంతో పాపులర్ అయిన.. పిక్చర్ అభీ బాకీ హై దోస్త్ అన్నట్లుగా కేసీఆర్ చంద్రబాబు నాయుడు సినిమా ఇంకా ఉంది అని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు ఖండిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ సినియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసీఆర్ వ్యాఖ్యల మీద ఘాటుగా స్పందించారు. కేసీఆర్ అన్నట్లు ఇంకా సినిమా అయిపోలేదని.. అసలు సినిమా ముందుందని అన్నారు. చంద్రబబాబు నాయుడుతో సహా, ఏపి సర్కార్ కు చెందిన కీలకనేతలు, అధిరానేలతో కలిపి దాదాపు 120 ఫోన్లను తెలంగాణ సర్కార్ ట్యాపింగ్ చేసిందని, ఇదే విషయంపై ఏపి సీఎస్, డిజిపిలు కేంద్రానికి ఫిర్యాదు చేశారని అన్నారు. అయితే ఇలా కేసీఆర్ గారు సినిమా అయిపోలేదని అంటుంటే.. సోమిరెడ్డి గారు అసలు సినిమా ఇప్పుడే మొదలైందని అంటున్నారు. మొత్తానికి ఏ పార్టీ వాళ్లకు వాళ్ల సొంత సినిమా ఉంది. మరి ఆయా పార్టీ వాళ్లే ఇందులొ హీరోలు.. యధావిధిగా మామూలు జనాలు ఈ సినిమా ఆడియన్స్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Chandrababu  Telangana  Ap  Cinema  

Other Articles