KCR | Chandrababu | Telangana | Vulgar | words

Telangana cm kcr wrong words on chandrababu naidu his ministers

KCR, Chandrababu, Telangana, Vulgar, words

Telangana cm KCR wrong words on chandrababu naidu his ministers. KCR attacks with his vulgar language in Mahabubnagar meeting.

బూతులు కావాలా.. కేసీఆర్ ప్రసంగం ఉందిగా..!

Posted: 06/12/2015 08:13 AM IST
Telangana cm kcr wrong words on chandrababu naidu his ministers

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట చాతుర్యం గురించి అందరికి తెలుసు. తన మాటల తూటాలతోనే ఎదుటివారిని మాట్లాడకుండా చెయ్యగల సమర్థుడు. అయితే చాలాకాలం తర్వాత మళ్లీ కేసీఆర్ తన పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల అనగానే ఏదో పిల్లలు వెళ్లే స్కూల్ ఏమో అనుకుంటున్నారేమో కానీ కాదు. ఉద్యమ సమయంలో ఎలాగైతే బూతులతో అందరిని తిట్టి తూర్పారబట్టారో తాజాగా మళ్లీ అదే తరహాలో తన నోటికి బాగా పని చెబుతున్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలోని వారిని కాంగ్రెస్, తెలుగుదేశం అని తేడా లేకుండా అందరిని తన బూతులతో తిట్టారు. ఇప్పుడూ అదే మాటలు మొదలుపెట్టారు. లుచ్చలు, దొంగలు, దిమాగ్ లేనోళ్లు, దద్దమ్మలు అంటూ తెగ బూతు జపం చేస్తున్నారు.

*చంద్రబాబు పోద్బలంతో ఏపీ ఇరిగేషన్‌ మంత్రి మాట్లాడుతున్నాడు... సన్నాసి. పాలమూరు ఎత్తిపోతలకు అనుమతే లేదు, ఎలా కడతారు అని ప్రశిస్తున్నారు. నీ అబ్బ జాగీరా రా కృష్ణానది? సమైక్య రాష్ట్రంలో నీ ఇష్టమొచ్చినట్లు, దొడ్డిదారిలో కట్టుకున్న హంద్రీ నీవా, పోతిరెడ్డి, కండలేరు, సోమశిల, వెలిగోడు, వెలిగొండ ప్రాజెక్టులకు అనుమతి ఉందా? ఎవరబ్బ జాగీరని కట్టారు? నిన్నగాక మొన్న పట్టిసీమ ప్రాజెక్టు ఎవరిని అడిగి మొదలుపెట్టారు? ఇప్పుడు... నన్ను అడిగే అధికారం మీకు ఎక్కడిది?’’ అని కేసీఆర్‌ అన్నారు.
*నరేంద్ర మోదీ మీకే ప్రధాని కాదు బిడ్డా... మాకు కూడా ప్రధానమంత్రే! మోదీ మీలాంటి కుక్కల మాట విని పాలమూరుకు నీళ్లు వద్దంటారా? కేంద్రం ఈ ప్రాజెక్టును అడ్డుకుంటుందా? ఆ సాహసం చేస్తుందా?’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ‘
*హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినా, మీ తాత జేజమ్మలు దిగొచ్చినా, కోటి మంది చంద్రబాబులు కొంగ జపం చేసినా... మీ కళ్లముందే పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తా. ఇదే నా శపథం’’ అని ప్రకటించారు.
*ఇది తెలంగాణ గడ్డ. జాగ్రత్త! ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’ అని హెచ్చరించారు.‘‘
*గతంలో ఆర్డీఎస్‌ పాదయాత్ర చేశాను. అప్పట్లో కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఒక మాట అన్నారు. కేసీఆర్‌ బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గి ఆర్డీఎస్‌ తూములు మూస్తే, బాంబులు పెట్టి బద్దలు కొడతామన్నారు. నాకు బాగా కోపం వచ్చింది.. బైరెడ్డీ... దేవుడు అందరికీ రెండు చేతులే ఇచ్చారు. ఆర్డీఎస్‌ కాడ అడుగు పెడితే కొడుకా... సుంకేసుల బరాజ్‌ను వెయ్యి బాంబులు పెట్టి బద్దలు కొడతా! అని హెచ్చరించాను. అయితే... ఆ తర్వాత, వాడు సన్నాసి ఏదో మాట్లాడితే, నేను స్థాయి దిగి స్పందించానా అనుకున్నాను. కానీ... బాంబులు వేసే బిడ్డ మాకూ ఒకడు పుట్టాడు, ఇప్పుడు పాలమూరుకు నీళ్లొస్తాయని ప్రజలు సంతోషించారని విలేకరులు చెప్పారు’’ అని కేసీఆర్‌ వివరించారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తయిందా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 

*నీ ముండమోసిన సీఎం చంద్రబాబు పాలమూరును దత్తత తీసుకుని తొమ్మిదేళ్లు ఊరేగితే ఆర్డీఎస్‌ ఒక్క అడుగైనా ముందుకు పోయిందా?

ఇలా మహబూబ్ నగర్ సభలో కేసీఆర్ తన మాటల పాటవాన్ని చూపించారు. ఎవరైనా బూతులు నేర్చుకోవాలంటే మాత్రం ఓ రెండు మూడు సార్లు కేసీఆర్ స్పీచ్ వింటే సరిపోతుంది అని కూడా కొంత మంది అనుకుంటున్నారంటే కేసీఆర్ స్పీచ్ ఎంత ఎఫెక్టివ్ ఉందో తెలుస్తోంది.

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Chandrababu  Telangana  Vulgar  words  

Other Articles