Chandrababu naidu | KCR | Tapping | NDA | Modi

Nda govt support to the ap cm chandrababu naidu

Chandrababu naidu, KCR, Tapping, NDA, Modi

NDA govt support to the ap cm Chandrababu naidu. Modi and Bjp top leaders support to Telugudesamparty and Chandrababu Naidu.

ఇక ఆపరేషన్ కేసీఆర్.. బాబు మంత్రాంగం

Posted: 06/12/2015 07:42 AM IST
Nda govt support to the ap cm chandrababu naidu

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనానికి కారణమైన ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఆడియో టేపులపై ట్యాపింగ్ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఢిల్లీలో చంద్రబాబు ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలవడంతో.. దాదాపు చంద్రబాబు మంత్రాంగం పనిచేస్తోందనే చెప్పాలి. మిత్రపక్షమైన తెలుగుదేం పార్టీకి అండగా నిలవాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఉమ్మడి గవర్నర్ రెండు రాష్ట్రాల మధ్య శాంతి వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ వివాదంపై ఫిర్యాదులపై ఐబీ, ఇతర నిఘా సంస్థల ద్వారా అంతర్గత విచారణ జరిపించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. చంద్రబాబు బుధవారం ప్రధానమంత్రి మోదీకి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు కేంద్ర హోంసెక్రటరీ గోయల్‌కు సాక్ష్యాధారాలను సమర్పించారు. ఈ సాక్ష్యాధారాలను సీరియస్‌గా పట్టించుకుని సంబంధింత శాఖలు, ఏజెన్సీలతో దర్యాప్తు జరిపించాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెలుపడినట్లు తెలుస్తోంది

కాగా మరోపక్క చంద్రబాబుకు అండగా, కేసీఆర్ మీద విమర్శల వర్షం మొదలైంది. కొంత మంది కేంద్ర మంత్రులు చంద్రబాబుకు అండగా నిలవడంతో పాటు కేసీఆర్ మీద తిట్లపురాణం కూడా మొదలుపెట్టారు. కేసీఆర్‌ ఏమీ పుణ్యాత్ముడు కాదని, ఆయన వ్యవ హారాల గురించి కూడా తగిన సమాచారం తమ వద్ద ఉందని కేంద్ర నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌ ఎక్కడెక్కడ ప్రత్యర్థులపై నిఘా వేయించారో, ఎవరెవరి ఫోన్లు బగ్గింగ్‌ చేయించారో టెలీ కమ్యూనికేషన్ల మంతిత్వ శాఖ, ఐబీ వంటి ఏజెన్సీలు తెలుసుకో వడం పెద్ద పని కాదని కేంద్రం భావిస్తోంది. చంద్రబాబుకు పూర్తి మద్దతు ఇవ్వడమే సరైనదని, ఆయన బీజేపీకి నమ్మకస్తుడైన మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ చీఫ్‌ అమిత్‌షా కూడా భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల బీజేపీకి ఒక ఎమ్మెల్సీ సీటును కూడా కేటాయించారని, తమకు ఒక ఎంపీ కూడా టీడీపీ ద్వారా వచ్చిందని, వచ్చే ఏడాది కూడా ఈ ఎంపీ టీడీపీ ద్వారా ఎన్నిక కావల్సి ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీ కలిస్తే నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి దోహదపడొచ్చని, అప్పుడు రెండు పార్టీలకూ ఏపీలో పదేళ్లపాటు తిరుగుండదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరి బిజెపి పార్టీ చంద్రబాబు నాయుడకు అండగా నిలుస్తోందని స్పష్టమైంది. మరి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఈ ఇష్యూను ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  KCR  Tapping  NDA  Modi  

Other Articles