Balakrishna | Chandrababu | Talassani | Telangana

Telangana minister talasani srinivas yadav said that balayya wil get offer after chandrababunaidu

Balakrishna, Chandrababu, Talassani, Telangana

Telangana minister Talasani Srinivas Yadav said that Balayya wil get offer after chandrababunaidu.

బాలయ్య ఓపిక పడితే భలే ఛాన్స్

Posted: 06/11/2015 02:53 PM IST
Telangana minister talasani srinivas yadav said that balayya wil get offer after chandrababunaidu

బాలయ్యకు బంపర్ ఆఫర్.. అనగానే ఏదో సినిమాకు సంబందించిన అంతా ఓకే అయిపోయిందేమో అందుకే అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ సినిమా మ్యాటర్ కాదు. తెలుగుదేశం పార్టీకి, బాలకృష్ణకు సంబందింన మ్యాటర్. అయితే గత మూడు నాలుగు రోజులుగా జరుతున్న పరిణామాలు బాలయ్యకు భలే ఛాన్స్ తీసుకువస్తాయట. అవును చంద్రబాబు నాయుడు తర్వాత నెక్ట్ లైన్ లోఉన్నది బాలయ్య బాబూ కదా.. కాబట్టి భలే ఛాన్స్ దొరుకుతుంది. కానీ కాస్త ఓపిక పట్టండి అంటున్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తాజాగా జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడిన తలసాని బాలయ్య బాబుకు ఉన్న ఛాన్స్ గురించి వివరించారు. ఇంతకీ బాలయ్యకు వస్తున్న ఆ చాన్స్ ఏంటో తెలుసా..?

ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాగూ రాజీనామా చెయ్యాల్సి వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి పీఠం నుండి, తెలుగుదేశం పార్టీ అధినేత పదవి నుండి ఎలాగూ దిగిపోతారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అయితే అలా చంద్రబాబు నాయుడు గనక దిగిపోతే ఎలాగూ తర్వాత క్యూలో ఉన్నది నందమూరి బాలకృష్ణనే కాబట్టి ఆ అవకాశం నీకే వస్తుంది కాస్త ఓపిక పట్టు అని అన్నారు ఆ అవకాశం గురించే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Chandrababu  Talassani  Telangana  

Other Articles