The AIMPLB demanded that the order which made yoga and Surya Namaskar compulsory in schools be cancelled

Muslim law board campaign against making yoga compulsory for kids in schools

AIMPLB, muslim board, all india muslim board, yoga in schools, surya namaskar in schools, rajnath singh, central government, narendra modi news, narendra modi updates, narendra modi controversy, narendra modi gallery, narendra modi

Muslim law board campaign against making yoga compulsory for kids in Schools : The All India Muslim Personal Law Board (AIMPLB) on Sunday decided to launch a nationwide campaign against making Hindu religious practices such as yoga and Surya Namaskar compulsory in schools.

స్కూల్ ‘యోగా’పై ముస్లిం బోర్డు నిరసన ‘యుద్ధం’

Posted: 06/11/2015 03:27 PM IST
Muslim law board campaign against making yoga compulsory for kids in schools

మోడీ ప్రభుత్వం యావత్ దేశంమొత్తం మీదున్న స్కూళ్లలో యోగా, సూర్య నమస్కారాలను అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై కేంద్రప్రభుత్వం చర్యలకు దిగింది. స్కూల్లోని పిల్లలు యోగా చేస్తే వారి ఆరోగ్యం మెరుగవుతుందన్న ఉద్దేశంతో ఈమేరకు మోడీ సర్కార్ ముందుకు సాగుతోంది. అయితే.. యోగా, సూర్యనమస్కారాలు హిందూ ఆచారాలకు అనుగుణంగా వుంటాయని, అవి ముస్లిం మతానికి వ్యతిరేకమంటూ కొందరు ముస్లిం మతపెద్దలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కాగా.. ఈ విధంగా ఈ యోగాపై వస్తున్న విమర్శలను కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తోసిపుచ్చుతున్నారు. యోగాకు, మతానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన వాదిస్తున్నారు.

కానీ.. యోగా, సూర్యనమస్కారాలు హిందూ ఆచారాలకు సంబంధించినవి కాబట్టి వాటిని స్కూళ్లలో అమలుపరచకూడదని ‘ఆల్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డ్’ (AIMPLB) దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. స్కూళ్లల్లో యోగా, సూర్యనమస్కారాలు చేయిస్తే.. ముస్లిం పిల్లలపై వాటి ప్రభావం వుంటుందని, తద్వారా వాళ్లు రానున్న రోజుల్లో తమ మతం మరిచి హిందూమతాన్ని స్వీకరిస్తారన్న భానవతో దీనికి విరుద్ధంగా AIMPLB గొంతెత్తుతోంది. ఇప్పటికే ఈ నిరసన కార్యక్రమం చేపట్టే ప్రణాళికల గురించి AIMPLB లక్నోలో మజ్లిస్-ఏ-ఆమ్లా పేరిట వర్కింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో భాగంగా పాఠశాలల్లో యోగ, సూర్య నమస్కార్ వంటి హిందూ మత సంప్రదాయాల చర్యలను ఆపాటట్లుగా చూడాలని నిర్ణయించింది. అలాగే ముస్లిం మత స్వేచ్ఛను పరిరక్షించడం కోసం ‘షరియా లా’ ప్రవేశపెట్టాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే AIMPLB సభ్యులు ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విధానాలు పూర్తిగా ముస్లిం మతస్థులకు వ్యతిరేకంగా వున్నాయని వారు ఆరోపించారు. నరేంద్రమోడీ అనుసరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన దేశానికి కాకుండా ఆర్ఎస్ఎస్ కి ప్రధానిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని బోర్డు సభ్యుడైన మౌలానా అబ్దుల్ రహీమ్ ఖురేషి పేర్కొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ సమగ్రత లోపించిందని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIMPLB  narendra modi  yoga surya namaskar  rajnath singh  

Other Articles